‘గవర్నర్‌ను పిలవరుగానీ..  రాష్ట్రపతి విషయంలో విమర్శలా?’

Hyderabad: Kishan Reddy Slams Cm Kcr Over Parliament Building Opening Issue - Sakshi

రాష్ట్ర ప్రయోజనాలపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఏదీ?: కిషన్‌రెడ్డి  

సాక్షి,అంబర్‌పేట (హైదరాబాద్‌): సీఎం కేసీఆర్‌ బాధ్య తా రహిత సీఎం అని.. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కీల క సమావేశాలు, కార్యక్రమాలకు కూడా హాజరుకాకపోవడం కేసీఆర్‌ అహంకారానికి నిదర్శమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌ విద్యానగర్‌ శివం రోడ్డులోని అడ్వాన్స్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఏటీఐ)లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు హాజరుకాలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, సికింద్రాబాద్‌లో వందేభారత్‌ రైలు ప్రారం¿ోత్సవాలకు కేసీఆర్‌ రాలేదేమని నిలదీశారు.

ప్రముఖుల జయంతులకు వెళ్లే తీరిక సీఎం కేసీఆర్‌కు ఉండదుగానీ.. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సమావేశాలకు మాత్రం తీరిక ఉంటుందని విమర్శించారు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తూ తెలంగాణకు నష్టం కలిగేలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం రోజుకు ఎన్ని సెటిల్‌మెంట్లు చేశాం, ఎందరిని మోసం చేశామని సమీక్షించుకుంటుందే తప్ప. రాష్ట్ర ప్రయోజనాలపై సమీక్ష ఉండదని ఆరోపించారు. రాష్ట్ర సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలనే సోయిలేని సీఎం కేసీఆర్‌.. కొత్త పార్లమెంటు ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవడం లేదని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top