'టీడీపీలో కొందరు నన్ను మానసికంగా హత్య చేశారు'

Guntur: Ganji Chiranjeevi Resigns to TDP - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరి తెలుగుదేశం పార్టీలో కీలక నేత గంజి చిరంజీవి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అందులో చేరాను. నేతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో తెలుగుదేశం పార్టీలో బీసీలకు చోటు ఉండదనేది అంతే నిజం. పార్టీ కోసం అహర్నిశలు పని చేశా. అయితే టీడీపీలో కొందరు నన్ను మానసికంగా హత్య చేశారు. బీసీ నేత అయినందుకే నన్ను అవమానపరిచారు. మంగళగిరి నియోజకవర్గం చేనేతలకు సంబంధించినది. 

ఆ ఒక్క సీటును కుమారుడి కోసం లాగేసుకొని మాకు ద్రోహం చేశారు. లోకేష్‌ కోసం ఒక పథకం ప్రకారం బీసీ సామాజికవర్గానికి చెందిన నన్ను పక్కకు పెట్టారు. పార్టీని నేను మోసం చేస్తే నేను నమ్ముకున్న దేవుడు నన్ను నాశనం చేస్తాడు. ఒకవేళ పార్టీ నన్నుమోసం చేస్తే అదే దేవుడు తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తాడు. 2019 చివరి వరకు సీటు నీదే అని నమ్మించి టికెట్‌ ఇవ్వకుండా తీవ్రంగా అమానించారని' గంజి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. 

చదవండి: (నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీతోనే: బాలినేని)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top