జనసేన బానిసత్వం ఇంకెన్నాళ్లు?: దేవినేని అవినాష్‌ | Devineni Avinash Condemn Balayya Comments On Jagan | Sakshi
Sakshi News home page

జనసేన బానిసత్వం ఇంకెన్నాళ్లు?: దేవినేని అవినాష్‌

Sep 26 2025 10:57 AM | Updated on Sep 26 2025 12:43 PM

Devineni Avinash Condemn Balayya Comments On Jagan

సాక్షి, విజయవాడ: తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో బసవతారకం ఆస్పత్రికి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎంతో సహకరించారని, అలాంటి వ్యక్తిపై నోరు పారేసుకుని నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తప్పు చేశారని వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్‌ అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ, వైఎస్‌ జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యపై శుక్రవారం నిరసన చేపట్టారాయన. 

శుక్రవారం బాడవ పేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పణలో దేవినేని అవినాష్‌(Devineni Avinash) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  పేదలకు మంచి చేసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌. అలాంటి వ్యక్తిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు(Balayya Comments On YS Jagan) సభ్యసమాజానికి సిగ్గుచేటు. ఎన్టీఆర్, వైఎస్సార్.. ఇద్దరూ మాకు దైవ సమానులే. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై కూడా మీకు గౌరవం ఉండేది. కానీ, ఈ వ్యాఖ్యలతో బాలకృష్ణపై ఉన్న గౌరవం పోయింది. 

గతంలో తాను అధికారంలో ఉండగా చంద్రబాబు ఏ ఒక్క పథకానికైనా ఎన్టీఆర్‌ పేరు పెట్టారా?. కనీసం అలాంటి ఆలోచనైనా చేశారా?. ఈ జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టిన దమ్ము వైఎస్‌ జగన్‌ది. ఆయన అధికారంలో ఉండగా బాలకృష్ణ సినిమాలకే కాదు.. బసవతారకం ఆస్పత్రికి కూడా సహకరించారు. మంచి చేసిన వారిని తూలనాడటం బాలకృష్ణకు అలవాటు. బెజవాడ సాక్షిగా మోదీ తల్లిని తిట్టి మళ్లీ వాటేసుకున్న వ్యక్తి బాలకృష్ణ. అలాంటి వ్యక్తి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు.. ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. వైఎస్సార్‌, జగన్‌ వల్ల మీ కుటుంబానికి జరిగిన మేలును బాలకృష్ణ ఓసారి గుర్తు చేసుకోవాలి.  

Devineni: బాలకృష్ణ తక్షణమే జగన్ కి క్షమాపణ చెప్పాలి

సభలో లేని.. అసలు సంబంధంలేని చిరంజీవిని కూడా బాలకృష్ణ తూలనాడారు. చిరంజీవిని తులనాడినా(Balayya on Chiru).. జనసేన తరఫు నుంచి కనీసం స్పందన లేదు. సభలో ఉన్న జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. ఎందుకు ఇంకా మీకు ఇంతటి బానిసత్వం?. నిండు సభలో చిరంజీవిని అవమానిస్తే ఏమైపోయారు మీరంతా?. 

మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారంతో తిరిగి ఏమీ అనలేకపోతున్నాం. కూటమి ఎమ్మెల్యేలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని అంబేద్కర్ ను కోరుకున్నాం. బాలకృష్ణ తక్షణమే జగన్ మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి అని దేవినేని అవినాష్‌ డిమాండ్‌ చేశారు. ఈ నిరసనల్లో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ పాటు విజయవాడ డిప్యూటీ మేయర్లు బెల్లందుర్గ , అవుతు శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: చిరు.. ఎవడు?? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement