ఫ్లాష్‌బ్యాక్‌ గుర్తుందా చంద్రబాబూ? | AP Assembly Session, How Chandrababu Naidu Govt Break PAC Chairman Tradition, More Details Inside | Sakshi
Sakshi News home page

ఫ్లాష్‌బ్యాక్‌ గుర్తుందా చంద్రబాబూ?

Nov 22 2024 9:17 AM | Updated on Nov 22 2024 10:30 AM

AP Assembly: How Chandrababu Govt Break PAC Chairman Tradition

అమరావతి, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల వాతావరణంతో ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలిసారిగా ప్రజా పద్దుల సంఘం(PAC) ఛైర్మన్ పదవికి ఎన్నిక జరగబోతోంది. వైఎస్సార్‌సీపీకి తగిన సంఖ్యా బలం లేదనే సాకు చూపిస్తూ.. అసెంబ్లీ సంప్రదాయానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం.

పీఏసీ చైర్మన్‌ పదవిని ఏకగ్రీవంగా.. ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా(1966 నుండి) వస్తోంది. అధికార కూటమి తర్వాత ఉంది.. విపక్ష స్థానంలో వైఎస్సార్‌సీపీనే కాబట్టి న్యాయంగా ఆ పదవి ఆ పార్టీకే దక్కాలి.  అయితే.. ఆ సంప్రదాయానికి గండికొట్టి.. తామే దక్కించుకోవాలని కూటమి ప్రయత్నిస్తోంది. పైగా ఏకగ్రీవం చేయకుండా.. కావాలనే కూటమి పార్టీ వాళ్లతో కావాలనే నామినేషన్లు వేయించారు చంద్రబాబు. అయితే..

సంప్రదాయంగా తమకు అవ­కాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యే,  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే.. నామినేషన్‌ సమయంలోనూ చివరిక్షణం దాకా అసెంబ్లీ సెక్రటరీ ఛాంబర్‌ వద్ద పెద్దడ్రామానే నడిచింది. 

ఇక.. మొత్తం 9 మంది సభ్యులకు 10 నామినేషన్లు(టీడీపీ 7, జనసేన 1, బీజేపీ 1, వైఎస్సార్‌సీపీ 1) వచ్చా­యి. దీంతో పీఏసీకి ఎన్నిక అనివార్యమైంది.  ఇవాళ సభ జరిగే టైంలోనే.. బ్యాలెట్‌ ద్వారా పోలింగ్‌ నిర్వహిస్తారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో గుర్తుందా?

2019లో టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. కేబినెట్‌ హోదా కలిగిన పీఏసీ చైర్మన్‌ పదవి టీడీపీకి కేటాయించింది. ఉన్న 23 మందిలో ఐదుగురు పక్కకు వెళ్లిన తరుణంలోనూ ప్రజాస్వామిక సంప్రదాయాలను కొనసాగించారు వైఎస్‌ జగన్‌. ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి అప్పట్లో ఈ పదవి అప్పగించారు.

.. అప్పట్లో వైఎస్సార్‌సీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల బలంతో టీడీపీకి పీఏసీ ఇవ్వకూడదని అనుకుంటే ఎన్నిక జరిపే అవకాశం ఉన్నా అలా మాత్రం చేయలేదు. ప్రజాస్వామిక సూత్రాలకు, సంప్రదాయాలకు గౌరవం ఇచ్చి పీఏసీ చైర్మన్‌ పదవిని అప్పట్లో టీడీపీకి కేటాయించారు. కానీ,

అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పీఏసీ పదవి దక్కకుండా చేసేందుకు ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 మంది పీఏసీ సభ్యత్వాలకు (టీడీపీ తరఫున 7, జనసేన 1, బీజేపీ 1) కూటమి తరఫున నామినేషన్లు వేయించడం గమనార్హం. పీఏసీతో పాటు అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. ఒక్కో కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement