కాంగ్రెస్‌ మరో జాబితా.. క‌న్హ‌య్య కుమార్ అక్కడి నుంచే.. | Congress Fresh List Of 10 Candidate Kanhaiya Kumar From North East Delhi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మరో జాబితా.. క‌న్హ‌య్య కుమార్ అక్కడి నుంచే..

Apr 14 2024 9:31 PM | Updated on Apr 14 2024 9:41 PM

Congress Fresh List Of 10 Candidate Kanhaiya Kumar From North East Delhi - Sakshi

ఢిల్లీ: లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు పలు రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొనటంలో బీజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మరో అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రటించింది. పదిమంది అభ్యర్థులతో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో ఢిల్లీ, పంజాబ్, అలహాబాద్ అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. పొత్తులో భాగంగా ఢిల్లీలో మూడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఈశాన్య ఢిల్లీ సీటు నుంచి క‌న్హ‌య్య కుమార్ బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా 75 మందితో ఒడిస్సా అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement