రాజకీయాలపై డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు

Cheating And Changing Political Parties Is Common In Politics - Sakshi

బెంగళూరు :  రాజకీయాలపై కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సదాశివనగర్‌లోని తన ఇంటి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజకీయాల్లో మోసం చేయటం అన్నది సర్వసాధారణ విషయం. నేను, కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే కాదు.. అన్ని పార్టీలు ఇందుకు ఉదాహరణ. మేము బీజేపీ నుంచి ప్రతాప్‌ గౌడ పాటిల్‌ను పార్టీలో చేర్చుకున్నాము. వేరే పార్టీలోకి పోవటం వెనక్కు రావటం రాజకీయాల్లో మామూలే.

పార్టీలోని ఒక్కోరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కానీ, వ్యక్తిగత అభిప్రాయాలకంటే పార్టీ అభిప్రాయాలు ఎంతో ముఖ్యం. పార్టీ వీడిన 17 మంది, అందులో మంత్రి పదవులు పొందిన వారు ఎ‍వ్వరూ పార్టీని సంప్రదించలేదు. జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమిని వీడి బీజేపీలోకి వెళ్లిన 17 మంది మాత్రమే కాదు. కాంగ్రెస్‌ పార్టీ ఐడియాలజీ నచ్చిన వాళ్లు ఎవరైనా అప్లై చేసుకుని పార్టీలో చేరొచ్చు. అన్ని అప్లికేషన్లు పరిశీలించి పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ’’ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top