పాపాలు పండటంతోనే చంద్రబాబుకు జైలు | Sakshi
Sakshi News home page

పాపాలు పండటంతోనే చంద్రబాబుకు జైలు

Published Mon, Sep 11 2023 4:18 AM

Chandrababu is in prison because of his sins - Sakshi

శిక్ష అనుభవించాల్సిందే
ప్రజాస్వామ్యంలో అవినీ­తి­కి పాల్పడిన వారు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఇందుకు చంద్రబాబు అరెస్ట్‌ ఉదాహరణ. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు. ఇన్నాళ్లు చట్టానికి దొరక్కుండా తిరిగారు. రాష్ట్రంలో ఎన్నో అకృత్యాలు చేశారు. పాపాలు పండటంతో కోర్టు ఎదుట నిలబడ్డారు. జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని కేసుల్లో అరెస్ట్‌ కాక తప్పదు. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలి
రెండెకరాల చంద్రబాబుకు సింగపూర్, మలేషియాలో రూ.4 లక్షల కోట్లు ఉన్నాయని మేధావులు అంటున్నారు. ఆ డబ్బు ఎలా సంపాదించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఒక్కగానొక్క బిడ్డ, మనవడి కోసం 14 ఏళ్లలో రూ.లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్న చంద్రబాబు పక్క రాష్ట్రాలు, దేశాలకు తరలించారు. ఒక్క కార్యకర్త అయినా రోడ్డెక్కి మాట్లాడట్లేదని అచ్చెన్నాయుడు బాధపడే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు అక్రమార్జనలో వాటాలు పంచుకున్నవారు తప్ప ఎవరూ మాట్లాడటానికి సిద్ధంగా లేరు. – నందిగం సురేష్, ఎంపీ

ఎన్టీఆర్‌ ఆత్మ శాంతిస్తుంది
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడి­చి క్షోభకు గురిచేసి ఆయ­న మరణానికి కారణమైన చంద్రబాబు జైలుకు వెళ్లడంతో ఎన్టీఆర్‌ ఆత్మ శాంతిస్తుంది. పేద పిల్లల సొమ్మును పందికొక్కులా దోచుకుతిన్న చంద్రబాబుకు సరైన శిక్ష పడింది. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు జైలుకెళుతున్న విషయాన్ని లోకేశ్‌ తన రెడ్‌బుక్‌లో రాసుకోవాలి. చంద్రబాబు అవినీతి ఆధారాలతో సహా నిరూపించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డికి ఎన్టీఆర్, వైఎస్సార్‌ అభిమానిగా కృతజ్ఞతలు. – కొడాలి నాని, ఎమ్మెల్యే, గుడివాడ

చంద్రబాబు పతనం మొదలైంది
పూణేకు చెందిన సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో స్కిల్‌ కుం­భకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేస్తే కుంభకోణం బయ­ట పడింది. సీమెన్స్‌ ఎండీ సంతకాలు ఎంవోయూలో వేర్వేరుగా ఉండటంతో లోతైన విచారణ కోసం సీఐడీ విచారణకు కేసును అప్పగించాం. ఇందులో ఏడు షెల్‌ కంపెనీల ద్వారా రూ.240 కోట్లు తరలించినట్టు బయటపడిందన్నారు. ఇక చంద్రబాబు పతనం మొదలైంది.      – చల్లా మధుసూదన్‌రెడ్డి,  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సలహాదారు

ఇది భగవంతుడు రాసిన స్క్రిప్టు
చంద్రబాబు అవినీతిప­రుడని కోర్టు ద్వారా ప్రజలందరికీ తెలిసింది. చంద్రబాబు, లోకేశ్‌ ఎంతోమంది మహిళల ఉసురుపోసు­కున్నారు. 74వ ఏట ఎన్టీఆర్‌కు ఘోరమైన అవమానం చేసిన చంద్రబాబు విచిత్రంగా అదే 74వ ఏటా తాను కూడా క్షోభ అనుభవించాల్సి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. కోర్టులను, మీడియాను వాడుకుని ప్రపంచాన్ని మోసం చేసిన చంద్రబాబు.. అదే కోర్టుల ద్వారా జైలుకు వెళ్లడం తప్పు చేసేవాళ్లకు పెద్ద హెచ్చరిక.     –ఎన్‌. లక్ష్మీపార్వతి, సతీమణి,    తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్‌పర్సన్‌

బాబు నేరాలు చాలా ఉన్నాయ్‌
రాజకీయాలంటే ప్రజలను, వ్యవస్థలను మేనేజ్‌ చేయడం కాదు. ప్రజా సేవ చేయడమనే చిన్న లాజిక్‌ చంద్రబాబు మిస్‌ అయ్యాడు. చంద్రబాబును అరెస్ట్‌ చేయగానే ఆయన పుత్రుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ రోడ్ల మీదకు వచ్చి నానా యాగీ చేశారు. టీడీపీ నేతలు చెబుతున్నట్టు ఇందులో రాజకీయ ప్రమేయం ఏమీ లేదు. చంద్రబాబు తప్పిదాలు చాలా ఉన్నాయి. ఇంకా చాలా స్కాములున్నాయి. ఎన్నో కేసుల్లో చంద్రబాబు ముద్దాయి.  –  ఆదిమూలపు సురేష్, మునిసిపల్‌ శాఖ మంత్రి

జీవితాంతం జైలే
చంద్రబాబు పాపం పండింది. ఇంకా అనేక కుంభకోణా­లు బయటకొస్తాయి. ఇన్నేళ్లూ ప్రజలను పీడించిన చంద్రబాబు ఇకపై ఖైదీగా జీవి­తాంతం జైలులో గడపాల్సిందే. వ్యవస్థలను మేనేజ్‌ చేసే సత్తా ఉందని చంద్రబాబు విర్రవీగారు. చట్టం తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ శిక్షిస్తుందని రుజువైంది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడను చంద్రబాబు ఇబ్బంది పెట్టినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడ దాక్కున్నారు. పవన్‌ వైఖరిని చూసి కాపులే ఛీ అంటున్నారు. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు,  పౌర సరఫరాల శాఖ మంత్రి

బాబు నిజస్వరూపం బయటపడింది
చంద్రబాబు నిజస్వరూపం, అతని అవినీతి బయట­పడ్డాయి. అనేక స్కాములకు పాల్పడిన చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేశారు. ఎప్పుడు ఏ అవినీతి ఆరోపణ వచ్చినా కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకురావడం చంద్రబాబు నైజం. ఆయన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయనను టీడీపీ నాయకులే నమ్మలేని పరిస్థితి వచ్చింది. ధర్నాలు చేయండి, రాస్తారోకోలు చేయండని పార్టీ శ్రేణులను బతిమాలుకున్నా ఎవరూ రాని పరిస్థితి నెలకొంది.  – జోగి రమేశ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి

Advertisement

తప్పక చదవండి

Advertisement