సీఎం రేవంత్‌తో మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భేటీ.. ఏం జరుగుతోంది? | BRS MLA Prakash Goud Meets CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌తో మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భేటీ.. ఏం జరుగుతోంది?

Jan 28 2024 7:15 PM | Updated on Jan 28 2024 8:47 PM

BRS MLA Prakash Goud Meets CM Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయంగా రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో పొలిటికల్‌ సమీకరణాలు మారుతున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు క్యూ కడుతున్నారు. దీంతో, రాజకీయంగా చర్చ మొదలైంది. 

కాగా, తాజాగా రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. నేడు సీఎం రేవంత్‌ రెడ్డిని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ కలిశారు. ఈ క్రమంలో ప్రకాష్‌ గౌడ్‌కు కాంగ్రెస్‌ కండువా కప్పి ప్రభుత్వ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి ఆహ్వానించారు. ఇక, సీఎం రేవంత్‌తో ప్రకాష్‌ దాదాపు గంట పాటు చర్చించారు. దీంతో, రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. 

ఇదిలా ఉండగా.. శనివారం కూడా సీఎం రేవంత్‌ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కలిశారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్‌తో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, ఇటీవలే మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా రేవంత్‌ను కలిశారు. వీరి భేటీపై పెద్ద చర్చ జరగడంతో నలుగురు ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్‌ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం అభివృద్ధిపై చర్చించేందుకే సీఎం రేవంత్‌ను కలిసినట్టు క్లారిటీ ఇచ్చారు. 

అయితే, బీఆర్‌ఎస్‌ నేతలు వరుస పెట్టి సీఎం రేవంత్‌ను కలుస్తున్న నేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల నాటికి రాష్ట్రంలో మరిన్ని వలసలు ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధు యాష్కీ  ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అనేక మంది విపక్ష ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ను టెన్షన్‌ పెడుతున్నట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement