ఎనిమిదేళ్ల మోదీ పాలన అమోఘం: నడ్డా

BJP National President JP Nadda Comments On PM Narendra Modi Meeting - Sakshi

బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రసంగ వివరాలు వెల్లడించిన స్మృతి ఇరానీ

సాక్షి, హైదరాబాద్‌: దేశ అభ్యున్నతి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎనిమిదేళ్లుగా సాగుతున్న నరేంద్ర మోదీ పాలనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా కొనియాడారు. పేదల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన అభినందించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభం కాగా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసం చేశారు.

నడ్డా ప్రసంగం వివరాలను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మీడి యాకు వెల్లడించారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన శ్యామాప్రసాద్‌ ముఖర్జీ స్వప్నించిన ఆర్టికల్‌ 370 రద్దు ప్రశంసనీయమని నడ్డా పేర్కొన్నట్లు తెలిపారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ అంత్యోదయ నినాదాన్ని సాకారం చేసేందుకు జన్‌ధన్‌ యోజన, బీమా, కిసాన్‌ సమ్మాన్‌ నిధి వంటి సామాజిక భద్రత, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉన్నతికి చేపట్టిన పథకాలను ఆయన కొనియాడినట్లు తెలిపారు.

కోవిడ్‌ సమయంలో సేవ చేసిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారనీ, 25 నెలలపాటు 80 కోట్ల ప్రజలకు ఉచితంగా బియ్యం అందించిన కేంద్రప్రభుత్వాన్ని అభినందించారని వెల్లడించారు. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తలకు, కశ్మీర్‌ వేర్పాటువాదుల చేతిలో అంతమైన కార్యకర్తల త్యాగాలు మరవలేనివనీ, రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ నాయకురాలు ద్రౌపదీ ముర్మును ప్రకటించడం బలహీనవర్గాలపట్ల బీజేపీ ప్రాధాన్యతను చాటిందని నడ్డా పేర్కొన్నట్లు వివరించారు.  

వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యం 
వ్యక్తుల కంటే వ్యవస్థలు ముఖ్యమన్న విషయం సీఎం కేసీఆర్‌ గుర్తించా లని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. రాజ్యాం గ ఉల్లంఘనలు చేయడంలో కేసీఆర్‌ ముందువరుసలో ఉంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ రాజ్యాంగాన్ని దేశంలోని ప్రజలెవరూ ఆమోదించేస్థితి లేదని అన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top