మిథాలీరాజ్‌తో జేపీ నడ్డా భేటీ

BJP Chief JP Nadda Reached Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వరంగల్‌లో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభ కోసం తెలంగాణ పర్యటనకు వచ్చారు. అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం జేపీ నడ్డా.. నగరంలోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, తరుణ్‌ చుగ్‌లతో పాటు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. 

కాగా, జేపీ నడ్డా.. శంషాబాద్‌ నుంచి నేరుగా నోవాటెల్‌ హోటల్‌కి వెళ్లారు. నోవాటెల్‌లో బీజేపీ నేతలతో పాటు మిథాలీ రాజ్‌తో నడ్డా భేటీ అయ్యారు. మధ్యాహ్నం 2.40 గంటల​కు ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళ్తారు. వరంగల్‌ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం, మధ్యాహ్నం 3.45 గంటలకు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొ.. వెంకటనారాయణ నివాసానికి నడ్డా చేరుకుని వారితో మాట్లాడతారు. సాయంత్రం 4.10 గంటలకి ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కి నడ్డా చేరుకుంటారు. వరంగల్‌ సభ అనంతరం హైదరాబాద్‌కు జేపీ నడ్డా తిరుగుపయనం అవుతారు. రాత్రి 7.30 గంటలకు నోవాటెల్‌లో నటుడు నితిన్‌తో నడ్డా భేటీ కానున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top