ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

Published Sat, Mar 9 2024 9:42 PM

BJP announces candidates for Bihar Uttar Pradesh MLC election - Sakshi

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. బిహార్‌లో మూడు స్థానాలకు, ఉత్తర ప్రదేశ్‌లో ఏడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను బీజేపీ వెల్లడించింది.

బిహార్‌లో మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతానికి మంగళ్ పాండే, డాక్టర్ లాల్ మోహన్ గుప్తా, అనామికా సింగ్‌లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. ఇక ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది. విజయ్ బహదూర్ పాఠక్, మహేంద్ర కుమార్ సింగ్, మోహిత్ బెనివాల్, అశోక్ కటారియా, ధర్మేంద్ర సింగ్, రాంతీరత్ సింఘాల్, సంతోష్ సింగ్‌లను రంగంలోకి దింపింది. 

బిహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 21న జరగనుండగా నామినేషన్ దాఖలుకు చివరి తేదీ మార్చి 11. మరోవైపు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, మాజీ మంత్రి అబ్దుల్‌బరీ సిద్ధిఖీ, ఊర్మిళా ఠాకూర్, సయ్యద్ ఫైసల్ అలీలను బరిలో నిలిపింది.

Advertisement
Advertisement