
May 29th AP Elections 2024 News Political Updates..
4:54 PM, May 29th, 2024
సీఈఓ మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
- సీఈఓ మీనా ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వై ఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు
- ఈసీఐ కార్యదర్శి రాజీవ్ కుమార్‌కి ఆ పార్టీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు
- పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధం
- అటెస్టేషన్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధం
- ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉంది
- సీఈఓ ముఖేష్‌కుమార్ మీనా ఇచ్చిన మెమోను తక్షణమే సమీక్షించి, పునరాలోచన చేయాలని వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి
2:24 PM, May 29th, 2024
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న విశాఖ పోలీసులు..!
- విశాఖపట్నం..
- సమస్యాత్మక నియోజకవర్గాల జాబితాలో విశాఖ నార్త్‌ను చేర్చిన పోలీసులు.
- గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లతో పాటు పార్టీ కీలక నేతలందరినీ పోలీస్ సమన్లు.
- కౌంటింగ్ రోజు బయటకు రాకూడదంటూ హెచ్చరిక.
- సుమారు 30 మందికి పైగా బైండోవర్
- కౌంటింగ్ ఏజెంట్లకు కూడా నోటీసులు ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి కేకే రాజు..
- వైఎస్సార్‌సీపీ నేతల టార్గెట్‌గా ఈసీ వ్యవహారిస్తుందంటు కేకే రాజు ఆరోపణ.
2:00 PM, May 29th, 2024
ప్రత్యర్థి ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలి: సజ్జల
- వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్‌షాప్ కార్యక్రమం
- ఈ సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
- సజ్జల కామెంట్స్..
- ఏపీలో ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలి.
- ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలి.
- కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
- వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుంది.
- జూన్ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది.
- అందులో ఎలాంటి అనుమానం లేదు
1:30 PM, May 29th, 2024
కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు..
- ఏపీ సీఈఓ మీనా ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
- ఈసీఐ కార్యదర్శి రాజీవ్ కుమార్‌కి ఫిర్యాదు చేసిన ఎంపీ నిరంజన్ రెడ్డి
- పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న వైఎస్సార్‌సీపీ
- ఇది ఈసీఐ నిబంధనలకు విరుద్ధం
- ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉందని ఫిర్యాదు
- సీఈఓ మీనా ఇచ్చిన మెమోను తక్షణమే సమీక్షించి, పునరాలోచన చెయ్యాలని కోరిన వైఎస్సార్‌సీపీ
10:20 AM, May 29th, 2024
ఈసీకి పేర్ని ప్రశ్నల వర్షం..
- పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల చెల్లుబాటుపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు..
- ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల చెల్లుబాటుపై పేర్ని నాని కామెంట్స్..
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ రాష్ట్రంలోని ఆర్వోలు అందరికీ ఆదేశాలు జారీ చేశారు.
- వీటిపై వైఎస్సార్‌సీపీ తరపున మేము అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాం.
- దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని వెసులు బాట్లు ఏపీలో ఎందుకు?
ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల చెల్లుబాటుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ రాష్ట్రంలోని ఆర్వోలు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. వీటిపై వైయస్సార్సీపీ తరపున మేము అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని వెసులు బాట్లు ఏపీలో ఎందుకు?
-పేర్ని… pic.twitter.com/Kvl8KQW1s1— YSR Congress Party (@YSRCParty) May 28, 2024
9:30 AM, May 29th, 2024
హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు..
- పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు
- నేడు హైదరాబాద్‌కు చేరిన బాబు.
- అమెరికా నుంచి వచ్చినట్టు పచ్చ బ్యాచ్ లీక్‌లు.
- కానీ, చంద్రబాబు మాత్రం మౌనం.
8:20 AM, May 29th, 2024
నేడు హైదరాబాద్‌కు చంద్రబాబు
- ఎన్నికల పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు.
- నేడు తిరిగి హైదరాబాద్‌కు రానున్న చంద్రబాబు
- ఇన్నాళ్లు ఎక్కడున్నారో చెప్పని బాబు.
7:30 AM, May 29th, 2024
అల్లర్లకు ప్లాన్ చేస్తున్నా టీడీపీ..
- మంత్రి మేరుగు నాగార్జున కామెంట్స్..
- కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర!
- పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలు
- అయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఎన్నికల సంఘం
- చివరకు ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరు
- ఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటని ప్రశ్నించిన మేరుగు నాగార్జున
కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర!
పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలు
అయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరు
ఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?
-మంత్రి మేరుగు నాగార్జున#TDPLosing#YSRCPWinningBig pic.twitter.com/FLV1NZcVbf— YSR Congress Party (@YSRCParty) May 28, 2024
ఆగని ‘సంక్షేమం’
- రాష్ట్రంలో పోలింగ్ తర్వాత కూడా ఆగని ‘చేయూత’
- లబ్ధిదారుల ఖాతాల్లో కొనసాగుతున్న డబ్బుల జమ
- పోలింగ్ అనంతరం 18న రూ. 1,513 కోట్లు
- 24న మరో రూ. 200 కోట్లు, 27న ఇంకో రూ. 400 కోట్లు
- 20న ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 629 కోట్లు
- ఎన్నికలతో సంబంధం లేకుండా పథకాల లబ్ధి పొందిన మహిళలు
6:50 AM, May 29th, 2024
ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో!
పోస్టల్ బ్యాలెట్ ఆమోదంపై గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు
దేశవ్యాప్తంగా అవే అమలు కూడా..
కానీ, డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ అధికారి స్టాంప్ లేకపోయినా.. సంతకం ఉంటే చాలు ఆమోదించాలని టీడీపీ విజ్ఞప్తి
ఆ మేరకు సడలింపు ఇస్తూ ఈనెల 25న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు
అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంపై అనుమానం వస్తే ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి వద్ద సంతకంతో సరిపోల్చుకోవాలని ఆదేశాలు
ఇది పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో వివాదాలకు దారితీస్తుందంటున్న రాజకీయ పక్షాలు.. శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తుందంటూ ఆందోళన
రాష్ట్ర ఎన్నికల సంఘం మరీ ఇంత ‘పచ్చ’పాతంపై విస్మయం
6:40 AM, May 29th, 2024
ఈసీ అంపైర్‌లా లేదు
దానికి చంద్రబాబు వైరస్ సోకింది.. వారంలో టీడీపీ పీడ విరగడ
అధికారంలోకి వచ్చేది వైఎస్సార్‌సీపీనే
గీత దాటిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరిక
సీఈసీ మార్గదర్శకాలు దేశమంతా ఒకేలా ఉండాలి..
పోలీసుల ద్వారా పిన్నెల్లిని అంతమొందించేందుకు బాబు కుట్ర
అందుకే ఏడుగురి హత్య కేసులో నిందితుడైన బ్రహ్మారెడ్డికి మాచర్ల టికెట్
చంద్రబాబు, ఎల్లో మీడియా కంటే ఉగ్రవాదులే నయం
గోబెల్స్ ప్రచారం చేసి.. వ్యక్తిత్వహననంతో అధికారులను లొంగదీసుకునే యత్నం
అందులో భాగమే సీఎస్‌పై అభూతకల్పనలతో కథనాలు
6:30 AM, May 29th, 2024
కౌంటింగ్‌లో అప్రమత్తత అవసరం
- ఫలితాలు వెలువడే వరకు ఏమరుపాటు పనికిరాదు
- అనుమానాలు నివృత్తి చేసుకోవాలి..
- కౌంటింగ్ ఏజెంట్ల జాబితా 31లోగా అందివ్వాలి
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచన