‘హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే కేసీఆర్‌ నీటి గొడవలు’

AP BJP Leader TG Venkatesh Slams KCR Over Water Issue - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ బీజేపీ నేత టీజీ వెంకటేష్‌ విమర్శలు

సాక్షి, కర్నూలు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత టీజీ వెంకటేష్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే కేసీఆర్‌ నీటి గొడవలు మొదలుపెట్టారు.. మాకు హైదరాబాద్‌ వచ్చే హక్కు ఉందని’’ తెలిపారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ..  కరోనా బాధితులను చెక్‌పోస్ట్‌ల వద్ద ఆపేశారు. విభజన హామీలను మరిచిపోతే ఎలా. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో ఇష్టమొచ్చినట్లు విద్యుదుత్పత్తి చేస్తామనడం సిగ్గుచేటు అంటూ విమర్శించారు. 

‘‘పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండాలి. పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ తెలంగాణ ప్రాజెక్టుల కంటే ముందే కట్టారు..మాకు నీళ్లిచ్చిన తర్వాతే తెలంగాణకు నీళ్లివ్వాలి. పోలీసులతో ప్రాజెక్ట్‌ను మోహరించడం కరెక్ట్‌ కాదని’’ బీజేపీ నేత టీజీ వెంకటేష్‌ మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top