
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్ర జరుగుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పవన్ చంద్రబాబుకు స్వరాష్ట్రంలో సొంత ఇల్లు లేదని.. ఎన్నికల తర్వాత పవన్ బాబు హైదరాబాద్ వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం వాళ్లిద్దరూ కలిసే జీవిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనపై కన్నా లక్ష్మీ నారాయణ మీద బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కన్నా వస్తాద్ కాదు.. బిచ్చగాడని అన్నారు. బూతులు తిట్టడంలో కన్నాను మించిన వారు లేరని మంత్రి ఎద్దేవా చేశారు.