Sakshi News home page

ముగిసిన అఖిలపక్ష భేటీ.. సహకరించాలని విపక్షాలకు ప్రభుత్వం వినతి..

Published Wed, Jul 19 2023 4:21 PM

All Party Meeting Ahead Of Parliament Monsoon Session - Sakshi

ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు జరిగిన అఖిలపక్ష భేటీ ముగిసింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ నేతృత్వంలో అన్ని పార్టీలు ఈరోజు పార్లమెంట్‌లో సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి దేశంలో వివిధ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు  సహకరించాలని అన్ని పార్టీలను ప్రభుత్వం కోరింది. కాగా.. ఈ వర్షాకాల సమావేశాలల్లో 14 బిల్లులను  ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

అయితే.. తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ విజయ సాయిరెడ్డి, బీఆర్ఎస్ తరఫున ఎంపీలు కేశవ రావు, నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. టీడీపీ నుంచి ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ సమావేశానికి హాజరయ్యారు. కాగా.. ఇక ఈ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అల్లర్లపై ప్రభుత్వం పెదవి విప్పనుందని సమాచారం.

ఈ సమావేశాల్లోనే  ఢిల్లీ పాలనాధికారాల ఆర్డినెన్స్ పై బిపార్ల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.  అయితే.. విపక్షాలు పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ‍్నించనున్నారు. ఎన్నికల సమయం అయినప్పటికీ ప్రజా సమస్యల చర్చ కోసం పార్లమెంటుకు వస్తున్నామని కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రం జాన్ చౌదరి తెలిపారు. విపక్షాలకు మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి మౌనాన్ని వీడాలని అన్నారు. 

ఇదీ చదవండి: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు: నేడు అఖిలపక్ష భేటీ.. ఎన్డీయే వర్సెస్‌ ఇండియాతో ఆసక్తికరంగా..

Advertisement

What’s your opinion

Advertisement