సింగరేణి ‘సూపర్‌’ బజార్‌ | - | Sakshi
Sakshi News home page

సింగరేణి ‘సూపర్‌’ బజార్‌

Apr 25 2026 9:36 AM | Updated on Apr 25 2026 9:36 AM

ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు

సాయంత్రం 4.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు

గోదావరిఖని: సింగరేణి సూపర్‌ బజార్‌(సూపర్‌ మార్కెట్‌)ను మరింత పటిష్టం చేశారు. అన్నిరకాల సరుకులతో వ్యాపార లావాదేవీలు పెంచుతున్నారు. సింగరేణి కార్మిక కుటుంబాలకు రాయితీతో కూడిన నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ అందించేందుకు గోదావరిఖని న్యూఅశోకథియేటర్‌ సమీపంలో సూపర్‌బజార్‌ కొనసాగుతోంది. కార్మిక కుటుంబాలతోపాటు స్థానికులకు నాణ్యమైన సరుకులను అందించడానికి సిద్ధమైంది. గత మార్చిలో ఆర్థిక సంవత్సర ముగిసింది. దీంతో కొత్త స్టాక్‌ తెప్పిస్తూ విక్రయిస్తున్నారు.

నిత్యావసరాల విక్రయాలు..

నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఏప్రిల్‌ నుంచి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అన్నిరకాల నిత్యావసరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. నాణ్యమైన పప్పుదినుసులు, వంటనూనెలు, బియ్యం విక్రయిస్తున్నారు. ఇతరత్రా సామగ్రి అందుబాటులోకి తెస్తున్నారు.

ఎలక్ట్రిక్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌..

కార్మికకుటుంబాలకు సులభమైన వాయిదా పద్ధ తుల్లో ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులను విక్రయించేందుకు సిద్ధం చేశారు. గృహోపకరణాలు, ఏసీలు, మొబైల్‌ ఫోన్స్‌, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్స్‌, టీవీలు అందుబాటులోకి తీసుకొచ్చారు.

సూపర్‌ బజార్‌ పనిచేసే వేళలు

ఆధునికత సంతరించుకున్న మార్కెట్‌

విస్తరిస్తున్న వ్యాపార లావాదేవీలు

Advertisement
 
Advertisement
Advertisement