నీరు పారేదెలా..
విలోచవరం వద్ద..
పోతారం వెళ్లే దారిలో పిచ్చిమొక్కలతో నిండిన కాలువ
పంటలకు సాగునీరు అందించే ఎస్సారెస్పీ కాలువలు నిర్లక్ష్యానికి నిలువెత్తుగా నిలుస్తున్నాయి. నిర్వహణ లేక అస్తవ్యస్తంగా మారుతున్నాయి. రబీ సీజన్‌లో పంటలకు సాగునీరు అందించే కాలువల్లో చెత్తా చెదారంతోపాటు పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. మంథని మండలం పోతారం, విలోచవరం, ఉప్పట్ల, మల్లెపల్లి గ్రామాలకు సాగునీరు అందించే కాలువలు ఇలా పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువల్లో చెత్తను తొలగించి సాగునీరు పారేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– మంథనిరూరల్
నీరు పారేదెలా..


