పథకాల అమలులో సర్పంచుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

పథకాల అమలులో సర్పంచుల పాత్ర కీలకం

Feb 20 2026 6:56 AM | Updated on Feb 20 2026 6:56 AM

పథకాల అమలులో సర్పంచుల పాత్ర కీలకం

పథకాల అమలులో సర్పంచుల పాత్ర కీలకం

పెద్దపల్లిరూరల్‌: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధి పనులను నిర్వహించడంలో సర్పంచుల పాత్ర కీలకమని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. జిల్లాలోని అంతర్గాం, ధర్మారం, ఎలిగేడు, జూలపల్లి, రామగిరి, మంథని, ముత్తారం మండలాలకు చెందిన సర్పంచులకు గురువారం నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులు మదర్‌థెరిస్సా ఇంజినీరింగ్‌ కాలేజీలో మొదలయ్యాయి. సర్పంచులుగా ఎన్నికై న వారి విధులు, బాధ్యతలు, నిధుల వినియోగం తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సమావేశంలో డీఎల్‌పీవోలు దేవకీదేవి, కొమురయ్య, ఏపీడీ సత్యనారాయణ, ఎంపీవోలు, ఎస్‌బీఎం రాఘవులు, ఈసీ అయూబ్‌ తదితరులున్నారు.

వార్డు సభ్యులకు శిక్షణ

పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని రైతువేదికలో వార్డు సభ్యుల శిక్షణ తరగతులు సాగుతున్నాయి. జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్‌ హాజరై సంక్షేమ పథకాల అమలు, వాటిపర్యవేక్షణకు వార్డుసభ్యులు పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్‌, సర్పంచ్‌ రోజారాణి, సీడీపీవో కవిత తదితరులున్నారు.

డీపీవో వీరబుచ్చయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement