సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు
కరీంనగర్: కరీంనగర్ ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జి అనిల్‌కుమార్ ఉత్తమ జర్నలిస్టు పురస్కారం అందుకున్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ఈ పురస్కారాన్ని అందించారు. జర్నలిజంలో మెరుగైన సేవలకు ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. అదే విధంగా కరీంనగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టులు తాడూరి కరుణాకర్, ప్రమోద్‌కుమార్ పురస్కారాలు అందుకున్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందజేశారు.
సక్రమంగా పరీక్షలు చేయాలి
పెద్దపల్లి: ల్యాబ్ టెక్నీషియన్స్ సక్రమంగా పరీక్షలు చేయడంతో పాటు రిపోర్టులు అందివ్వాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్ సూచించారు. కొత్తగా ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం పొందిన వారికి గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వాహించే విధానం, రికార్డ్స్ నిర్వహణ తదితర అంశాలపై వివరించారు. ప్రోగ్రాం అధికారులు బి.రాజమౌళి బి.కిరణ్‌కుమార్, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాబాటలో విద్యుత్ సమస్యలు పరిష్కారం
ఓదెల(పెద్దపల్లి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాబాట కార్యక్రమంలో విద్యుత్ సమస్యలు పరిష్కారం అవుతాయని ట్రాన్స్‌కో ఏడీఏ రవీందర్ పేర్కొన్నారు. గురువారం ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో ప్రజాబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ, గ్రామాల్లో వేలాడే విద్యుత్ తీగలు, వంగిన స్తంభాలను బాగు చేయడం, విరిగిన చోట కొత్త స్తంభాలు వేయడం జరుగుతుందన్నారు. సర్పంచు పల్లె కనుకన్న, ఏఈఈ మోహన్‌నాయక్, ఉప సర్పంచు పాకాల సంపత్‌రెడ్డి, మాజీ సర్పంచు బొంగోని రాజయ్యగౌడ్ పాల్గొన్నారు.
కౌన్సిలర్ ఔదార్యం
మంథని: మంథని మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు ప్రజలు ఇచ్చిన విజయంతో పూర్తిగా వారి అభివృద్ధికి పాటుపడుతానని వార్డు కౌన్సిలర్ పోతరవేని శ్రీలతకాంత్రి అన్నారు. గురువారం స్థానిక నాగులమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. తనకు వచ్చే గౌరవ వేతనం ప్రతినెలా బోయిన్‌పేటలోని ఒక నిరుపేద కుటుంబానికి అందజేస్తానని ప్రకటించారు. వార్డు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని చెప్పారు. బోయిన్‌పేట ప్రాథమి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు మంచిగా చదువుకొని రాణించాలని కోరారు. మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ క్రాంతికుమార్, ప్రధానోపాధ్యాయుడు బహుత్ కిషోర్, పాఠశాల కమిటీ చైర్మన్ అట్టెం సుధాకర్ తదితరులు ఉన్నారు.
సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు
సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు
సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు


