పత్తి విక్రయాలపై సందిగ్ధం
● 17 నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్‌కు అసోసియేషన్ పిలుపు ● అయోమయంలో అన్నదాతలు
పెద్దపల్లి: పత్తి కొనుగోళ్లపై సందిగ్ధం నెలకొంది. ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొంటామని సీసీఐ చెప్పడంతో వివాదం నెలకొంది. నిబంధనలు సడలించాలని నెలరోజులుగా కోరుతున్నా సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం నుంచి జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పత్తి కొనుగోళ్ల బంద్‌కు పిలుపునిచ్చింది. బిహార్ ఎన్నికల తర్వాత కేంద్రం మంత్రి నిబంధనల సడలింపుపై ప్రకటన చేస్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నిబంధనలు సడలించకపోవడంతో జిన్నింగ్ అసోసియేషన్ బంద్ నిర్ణయం తీసుకుంది. బంద్ నేపథ్యంలో రైతులు పెద్దపల్లి మార్కెట్‌కు పత్తిని తీసుకురావద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు.
జిల్లాలో సాగు వివరాలు
పత్తిసాగు: 48,215 ఎకరాలు సాగుచేసిన రైతులు: 2,982దిగుబడి అంచనా: 5,78,580 టన్నులు ఇప్పటివరకు కొనుగోళ్లు: 18,872 క్వింటాళ్లు


