భూగర్భ గని పరిశీలన
గోదావరిఖని(రామగుండం): జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కిషోర్‌మక్వాన ఆదివారం సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–11గని సందర్శించారు. చైర్‌కార్ ద్వారా గనిలోని రెండో సీమ్ 32వ లెవల్‌వద్దకు వెళ్లారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, ఏజెంట్ చిలుక శ్రీనివాస్ భూగర్భగనిలో బొగ్గు వెలికితీసే విధానం, ఉద్యోగులు పనిచేసే తీరు వివరించారు. అంతకముందు ఆర్జీ–1,2 ఏరియాలోని ఎస్సీ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. చైర్మన్ వెంట స భ్యులు వడ్డేపల్లి రాంచందర్, లవకుష్‌కుమార్, గూ డె శ్రీనివాస్, రీజినల్ ఆఫీస్ డైరెక్టర్ సునీల్‌కుమార్, ఈఅండ్‌ఎం డైరెక్టర్ తిరుమల్‌రావు, పర్సనల్ జీఎం కవితనాయుడు తదితరులు పాల్గొన్నారు.


