దేవునిపల్లి నృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి శ్రీల క్ష్మీనరసింహస్వా మి బ్రహ్మోత్సవా లు ఆదివారం అ ధ్యయనోత్సవా లతో ప్రారంభమయ్యాయి. సో మవారం సేవాకాలం, ప్రబంధ కాలక్షేపం, విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని ఆలయ ఈవో శంకరయ్య తెలిపారు. ఈనెల 4న ఉదయం మూలస్వామి వారికి పంచామృత నవకలశాభిషేకం, అమ్మవారికి, స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, పెళ్లికొడుకు, పెళ్లి కూతురును తయారు చేసే కార్యక్రమాలు ఉంటాయని ఆయన వివరించారు. బుధవారం ఉదయం స్వామివారి కల్యాణంతోపాటు ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వాహిస్తామని ఆలయ ఈవోపాటు అర్చకుడు శ్రీకాంతచార్యులు తెలిపారు.
వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి
పెద్దపల్లిరూరల్: స్థానిక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి ఆదివారం నిర్వహించారు. వేదపండితుడు శ్రీనివాస్ మంత్రోచ్ఛరణల మధ్య వేడుకలు జరిగాయి. ట్రస్టు వ్యవస్థాపకుడు కట్ట రాజానందంతోపాటు నాయకులు సత్యనారాయణ, రమేశ్, మోహనాచారి, వెంకటేశ్వర్లు, కోటన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకా లు, పూజాకార్యక్రమాలను నిర్వహించారు.
ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
ధర్మారం(ధర్మపురి): స్థాని క మోడల్ స్కూల్ విద్యార్థి ని ఎన్.తేజస్విని రాష్ట్రస్థా యి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ కొమురయ్య తెలిపారు. గోదావరిఖనిలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్– 14 విభా గంలో తొమ్మిదో తరగతి చదువుతున్న తేజ స్వీని ప్రతిభ కనబర్చిందన్నారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు వికారాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. ఆమెను ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, పీఈటీలు కొము రయ్య, మేకల సంజీవరావు అభినందించారు.
పెద్దపల్లివాసికి రాష్ట్రకార్యవర్గంలో చోటు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రానికి చెందిన ఎన్పీడీసీఎ ల్ ఏఈ వెంకటనారాయణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో పనిచేస్తున్న వెంకటనారాయణ.. వరుసగా నా లుగోసారి ఈ పదవికి ఎన్నికకావడంపై పలువురు అభినందించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వెంకటనారాయణ తెలిపారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని సుభాష్‌న గర్‌లో రహదారి, మురుగునీటి కాలువల పనులు చేపట్టిన కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సుభాష్‌నగర్, కమాన్‌బస్టాప్, ఇండేన్‌గ్యాస్, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆయన వివరించారు. విద్యుత్ వినియోగదారులు తమతో సహకరించాలని ఆయన కోరారు.
కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
పెద్దపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వా హకులు తేమ పేరిట కొర్రీలు పెట్టకుండా తక్షణమే తూకం వేసేలా అధికారులు చర్యలు తీ సుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు భారీవర్షాలతో దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. మిగిలిన పంటను కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోలు చేయాలని ఆయన కోరారు.
దేవునిపల్లి నృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
దేవునిపల్లి నృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
దేవునిపల్లి నృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం


