ప్రధాని మోదీపై సీఎం వ్యాఖ్యలు శోచనీయం
బీజేపీ నాయకుల ఆగ్రహం
పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో రాస్తారోకో
పెద్దపల్లిరూరల్: ప్రధాని నరేంద్రమోదీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు రాకేశ్, రమేశ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీపై సీఎం వ్యాఖ్యలు శోచనీయమన్నారు. తన వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు తంగెడ రాజేశ్వర్‌రావు, సంపత్‌రావు, దాడి సంతోష్, రాజగోపాల్, శ్రీనివాస్, తిరుపతి, రాజం మహంత కృష్ణ, సతీశ్, శ్రీధర్, ఉమేశ్, కుమార్, సబ్బు మల్లయ్య, రాజు, మహేశ్, రాజేంద్రప్రసాద్, ఉప్పు కిరణ్, శ్రీకాంత్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
హామీల అమలులో విఫలం
పెద్దపల్లి: హామీల అమలులో రాష్ట్టప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకులు ఆరోపించారు. స్థానిక పూసాల రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించా రు. సీఎం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తారనే సమాచారంతో సీఐ సుబ్బారెడ్డి, ఎస్సైలు శ్రవణ్ కుమార్, వేణుగోపాల్, అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు. బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, నాయకులు సౌదరి మహేందర్ యాదవ్, కామని రాజేంద్రప్రసాద్, కొమ్ము తిరుపతి, వేగోళం శ్రీనివాస్, మిట్టేపల్లి ప్రవీణ్ కుమార్, నాగేశ్వర్, అన్వేష్, గుంటి కుమార్, మహేశ్, రామకృష్ణ, రమేశ్, సదయ్య తదితరులు పాల్గొన్నారు.


