నెలాఖరు వరకు సిటీ పోలీస్‌యాక్ట్
గోదావరిఖని: బహిరంగ ప్రదేశా ల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తామని, అనుమతిలేని డ్రోన్, డీజే సౌండ్స్‌పై కఠిన చర్య లు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. ఈమేరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. మహిళలు, పౌరుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంచి ర్యాల, పెద్దపల్లి జోన్‌లలో ఈ ఆంక్షలు ఈనెలాఖరు వరకు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాల కోసం ముందుగా పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు.
ఎస్టీయూ జిల్లా కార్యవర్గం ఎన్నిక
పెద్దపల్లి: ఎస్టీయూ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక ఐఎంఏ భవన్‌లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నడిపెల్లి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మేరుగు సతీశ్, కోశాధికారిగా జి.మాధవాచారి ఎన్నికయ్యారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా మందల శ్రీకాంత్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా బోగె చంద్రశేఖర్, సయ్యద్ ఫయాజుద్దీన్, ఉపాధ్యక్షుడిలుగా శేషాద్రి, అడిషనల్ జనరల్ సెక్రటరీలుగా తోటరాజు, కిన్నెర శ్రీనివాస్, కార్యదర్శులుగా బడుగు నగేశ్, కె.శ్రవణ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర కోశాధికారి ఆట సదయ్య మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.
నేడు గోదావరి హారతి
మంథని: పట్టణ సమీపంలోని గోదావరి నదిలో సోమవారం గోదావరిహారతి కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. హారతి వేదిక స్థలాన్ని ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణతోపాటు పలువురు ఆదివారం పరిశీలించారు. నదీ దీపారాధనతో శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని, రుగ్వేదంలో నదులకు హారతులు ఇచ్చే సంస్కృతి ఉండేదని వారు అన్నారు. పునర్ వైభవం కోసమే గోదావరిహారతిని 2012 నుంచి నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి గోదావరి మాత ఆశీస్సులు పొందాలని వారు కోరారు. రాజమౌళి, శ్రీనివాసగుప్త, సబ్బ సత్యనారాయణ, నాంపల్లి రమేశ్, నారమల్ల కృష్ణ, కుమ్మరి మల్లిక్, తదితరులు పాల్గొన్నారు.
నెలాఖరు వరకు సిటీ పోలీస్‌యాక్ట్


