ఓటరు ప్రత్యేక సవరణకు సిద్ధం
పెద్దపల్లి: దొంగ ఓట్ల నియంత్రణ కోసం జిల్లాలో ఓటరు ప్రత్యేక సవరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకోసం 2002 నుంచి 2025 వరకు ఓటరు జాబితాలో నమోదైన వారి వివరాలను కేటగిరీల వారీగా తయారు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం సుమారు 23 ఏళ్ల తర్వాత ఈఏడాది ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్– స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. ఈమేరకు 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఓటరు జాబితాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. దీనిని బీఎల్‌వోలకు పోలింగ్ కేంద్రాల వారీగా అందిస్తుంది. అప్పటిజాబితాలోని ఓటరుగా నమోదైన వారి వివరాలను 2025 జూలై నాటి ఓటరు జాబితాతో సరిపోల్చుతారు.


