యువ కార్మికులతోనే యూనియన్ల మనుగడ
● సీఐటీయూ ఆలిండియా సెక్రటరీ సుదీప్ దత్త
గోదావరిఖని: యువకార్మికుల చైతన్యంతోనే కార్మి క సంఘాల మనుగడ సాధ్యమని సీఐటీయూ ఆలిండియా సెక్రటరీ సుదీప్‌దత్త అన్నారు. స్థానిక ఆర్‌సీవోఏ క్లబ్‌లో ఆదివారం యువ కార్మికుల సమస్యలపై అవగాహన కల్పించారు. కార్మిక సంఘాల్లో యువల భాగస్వామ్యం పెరిగితేనే హక్కులను కాపాడుకోవడం సులభతరం అవుతుందన్నారు. ఇందుకోసం కార్మిక చట్టాలపై మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. తద్వారా, రాజకీయ, ప్రభుత్వాలు తీసుకునే కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సమస్యలను నిర్లక్ష్యం చేయడంతోనే పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, భూపాల్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్.నాగరాజు, నాయకులు గోపాల్, ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, ఎస్‌కే గౌస్, సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, దాసరి సురేశ్, వంగల శివరాంరెడ్డి పాల్గొన్నారు.


