
శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యం
రామగుండం: శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల బాధ్యతని, నేరాల నియంత్రణపై ప్రత్యేక నిఘా పెడతామని గోదావరిఖని ఏసీపీ రమేశ్ అన్నారు. స్థానిక హౌసిగ్‌బోర్డు కాలనీలో శుక్రవారం వేకువజామున కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం(కార్డెన్ సెర్చ్) నిర్వహించారు. పోలీసు బలగాలు ఒక్కసారిగా కాలనీలోకి ప్రవేశించి తనిఖీలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంటింటా సోదాలు చేసిన పోలీసులు.. ధ్రువీకరణ పత్రాలు లేని పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్‌చేసి సాచారం ఇవ్వాలని కోరారు. సీఐ అజయ్‌బాబు, ఎస్సై సతీశ్ తదితరులు కాలనీవాసులు పలు అంశాలపై కౌన్సిలింగ్ ఇచ్చారు. స్వీయ రక్షణ కోసం కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.