
మాట్లాడుతున్న శ్యామ్‌ప్రసాద్
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రైసుమిల్లర్లు నిర్ణీత గడువులోగా సీఎంఆర్ డెలివరీ పూర్తిచేయాలని అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం సీఎంఆర్‌పై సమీక్షించారు. రైసుమిల్లులు పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసి నిర్ణీత గడువులోగా లక్ష్యాలు సాధించాలన్నారు. గడువులోగా డెలివరీ చేయని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట కోతలు లేకుండా దిగుమతి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, డీఎస్‌వో ప్రేమ్‌కుమార్, మిల్లర్లు పాల్గొన్నారు.