ఎంతకై నా తెగించుడే..! | - | Sakshi
Sakshi News home page

ఎంతకై నా తెగించుడే..!

Apr 1 2023 12:12 AM | Updated on Apr 1 2023 12:12 AM

రిలే దీక్షలలో పూర్వపు లబ్ధిదారులు
 - Sakshi

రిలే దీక్షలలో పూర్వపు లబ్ధిదారులు

ఈ ఫొటోలోని మహిళ పేరు కూరపాటి సరిత. ఊరు అంతర్గాం. 2016లో అధికారుల సమక్షంలో డబుల్‌ బెడ్రూం లబ్ధిదారుగా ఎంపికై ంది. ప్రస్తుతం పాత జాబితా చెల్లదని, కొత్తగా దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారితో కలిపి డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు ప్రకటించడంతో ఆందోళన చెందుతుంది. అధికారుల ప్రకటన తమను మోసం చేయడమే అని ఆవేదన వ్యక్తం చేసింది. తమ పేరుతో నిర్మించిన ఇళ్లు తమకు కేటాయించేదాకా ఎంతకై నా తెగిస్తాం అని స్పష్టం చేసింది. అందుకే అసంపూర్తి ఇళ్లలోనైనా ఉండేందుకు మకాం మార్చినం అని పేర్కొంది. డబుల్‌ బెడ్రూం ఇళ్ల సముదాయంలో రిలే దీక్షలో పాల్గొంది.

రామగుండం: ‘ఎమ్మెల్యే సార్‌ మీకు దండం పెడతాం.. ఏడేళ్ల కింద గ్రామపంచాయతీల్లో డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేసిండ్లు. గప్పుడు అప్పటి తహసీల్దార్‌ సమక్షంలోనే గీ తంతు జరిగింది. ఆ తర్వాతే లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా అంతర్గాం మండల కేంద్రంలో డబుల్‌ ఇళ్ల నిర్మాణం మొదలైంది. గానాటి సందీ మా ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందంటూ కళ్లలో వత్తులు వేసుకొని చూస్తున్నాం.. అధికారులు గిప్పుడు మాటమార్చి ఆనాటి డ్రా రద్దు చేసినం.. మీరు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అందరితో కలిపి డ్రా తీస్తామంటూ చెప్పడంతో మాకు కంటి మీద కునుకులేకుండా పోయింది. మాలాంటి ఇళ్లు లేనోళ్లను ప్రభుత్వం మోసం చేసుడు ఎంతవరకు కరెక్టో చెప్పుండ్లి’ అంటూ వచ్చిన వారందరికీ తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. గతంలో డ్రాలో పేరొచ్చిన మూడు గ్రామాల లబ్ధిదారులు అసంపూర్తి గృహాలైనా అందులోనే తలదాచుకుందామని నిర్ణయించుకొని మకాం మార్చినమంటూ స్పష్టం చేశారు. కాగా అంతర్గాం మండల కేంద్రంలో నిర్మితమవుతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంచాయితీ తారాస్థాయికి చేరేలా కనిపిస్తోంది.

గత లబ్ధిదారుల రిలే దీక్ష

అంతర్గాం మండల కేంద్రంలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సముదాయ ప్రాంగణంలో శుక్రవారం నుంచి రిలే దీక్షలను ప్రారంభించారు. గృహ నిర్మాణాలకు ముందే 2016లో తహసీల్దార్‌ సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తమకు కేటాయించిన తర్వాత మిగతావారికి డ్రా విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీక్షలో గోలివాడ, టీటీఎస్‌ అంతర్గాం, విలేజి అంతర్గాం గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.

ఏడేళ్లు గడిచినా అసంపూర్తిగానే..

కార్పొరేషన్‌లో డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసినా అంతర్గాం మండల కేంద్రంలో నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఇంకా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీటీఎస్‌ అంతర్గాం, విలేజీ అంతర్గాం, గోలివాడ మూడు గ్రామాల పేరిట మొత్తం 80 గృహాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. కాగా కాంట్రాక్టర్‌కు లక్షలాది రూపాయల బిల్లు పెండింగ్‌ ఉండడంతోనే పూర్తి చేసేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై సంబంధిత కాంట్రాక్టర్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా స్పందించలేదు.

అధికారుల నిర్ణయంతో

గత లబ్ధిదారుల ఆందోళన

తమకు కేటాయించిన తర్వాతే

మళ్లీ డ్రా తీయాలని డిమాండ్‌

అంతర్గాంలో ‘డబుల్‌’ పంచాయితీ

మండల కేంద్రంలోని డబుల్‌ బెడ్రూం ఇళ్ల సముదాయంలో రిలే దీక్ష

ఏడేళ్ల నుంచి ఆశతో ఉన్నాం

2016లో మా గ్రామ పంచాయతీలో డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. నాటి నుంచి నేటి వరకు తలదాచుకునేందుకు మాకు ఇల్లు దక్కుతుందని మా కుటుంబం ఎంతో ఆశతో ఉన్నాం. కానీ అధికారుల నిర్ణయంతో మా గుండెల మీద బండరాయి వేసినట్లయింది. దీనిపై అధికారులు పునరాలోచించాలి.

– దూస లక్ష్మి, లబ్ధిదారు, విలేజీ అంతర్గాం

మాట నిలబెట్టుకోవాలి

ఏడేళ్ల కిందట ఇదే ప్రభుత్వ అధికారులు డ్రా తీసి అందరి సమక్షంలో మమ్మల్ని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. అదే మాటను అధికారులు నిలబెట్టుకొని ముందుగా మాకు కేటాయించిన తర్వాత మిగిలిన గృహాలకు డ్రా తీసి కొత్త లబ్ధిదారుల ఎంపిక చేయాలి.

– మాడ లక్ష్మి, లబ్ధిదారు, గోలివాడ

ప్రభుత్వ ఆదేశాల మేరకు..

2016లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయిస్తున్నట్లు ఎలాంటి అధికారిక పత్రాలు జారీ చేయలేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నవారితో కలిపి డ్రాలో ఎంపిక చేస్తాం. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటారు. పూర్వపు లబ్ధిదారులకు గృహాలు కేటాయించే అధికారం నా పరిధిలో లేదు.

– వేణుగోపాల్‌, తహసీల్దార్‌, అంతర్గాం

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement