
ర్యాకల్‌దేవుపల్లిలో మొక్కజొన్నను పరిశీలిస్తున్న గుజ్జుల రామకృష్ణారెడ్డి
ఎకరాకు
రూ.40వేలు ఇవ్వాలి
ఎలిగేడు: వడగండ్ల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40వేల చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ర్యాకల్‌దేవుపల్లిలో వరి పొలాలు, మొక్కజొన్న రైతులతోపాటు ఇంటిపైకప్పులు లేచిపోయిన బాధితులను పరామర్శించారు. వడగండ్లతో మండలంలో తీవ్ర నష్టం వాటిల్లిందని, కలెక్టర్ చొరవ చూపి సమగ్ర నివేదిక సేకరించి రైతులందరికీ న్యాయం చేయాలని కోరారు. ఇంటిపైకప్పులు దెబ్బతిన్న కుటుంబాలు ఇళ్ల నిర్మాణానికి రూ.3లక్షలు ఇవ్వాలన్నారు. పార్టీ నాయకులు మీస అర్జున్‌రావు, లింగారెడ్డి, గర్రెపల్లి నారాయణస్వామి, పార్టీ మండల అధ్యక్షుడు మామిడాల రమేశ్, గోపు సురేందర్‌రెడ్డి, మల్లారపు అంజయ్య, కొక్కొరాల దామోదర్‌రావు, గోపు మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఫసల్ బీమా చేస్తే బాగుండేది
సుల్తానాబాద్: వడగండ్లతో రైతులు ఎంతో నష్టపోయారని, ఫసల్ బీమా చేయిస్తే బాగుండేదని గుజ్జుల అన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం కల్పించిన ఫసల్ బీమాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే రైతులకు మేలు జరిగేదన్నారు. సుల్తానాబాద్, ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, పెద్దపల్లిలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేయాలని కోరారు. నాయకులు శంకర్, మహేందర్ సదయ్య, నాగరాజు, రాజు, శ్రీనివాస్ గౌడ్, పవన్ పాల్గొన్నారు.