ఎంపీడీఓపైనా పీడీ చిందులు | - | Sakshi
Sakshi News home page

ఎంపీడీఓపైనా పీడీ చిందులు

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

ఎంపీడీఓపైనా పీడీ చిందులు

పీడీ ఆగ్రహానికి కేవలం కిందిస్థాయి సిబ్బందే కాకుండా, మండలాధికారిణి అయిన ఎంపీడీఓ ఆర్‌.వాణిశ్రీ సైతం బలయ్యారు. ఆమె తప్పులేకపోయినా, ఏపీఓ పక్కనే ఉన్న ఆమెను కూడా పీడీ ఇష్టానుసారంగా దుర్భాషలాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె కార్యాలయంలోనే కన్నీరు మున్నీరయ్యారు. ఇటువంటి అవమానకర వాతావరణంలో తాము విధులు నిర్వహించలేమంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు. పీడీ వేధింపుల కారణంగా జిల్లాలో ఎంతోమంది ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురై ఆస్పత్రుల పాలయ్యారని ఉద్యోగులు మీడియాకు వివరించారు. ఈ మేరకు టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఏపీఓలు, ఈసీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, జేఈలు అందరూ కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement