సభ్యసమాజం తలదించుకునేలా... | - | Sakshi
Sakshi News home page

సభ్యసమాజం తలదించుకునేలా...

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

సభ్యసమాజం తలదించుకునేలా...

బలిజిపేట మండలంలో ఉపాధిహామీ పనుల పరిశీలన నిమిత్తం ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన పీడీ రామచంద్రరావు.. వర్క్‌ ఆర్డర్‌ పూర్తి కాలేదనే నెపంతో అక్కడే ఉన్న ఏపీఓ కేశవరావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతటితో ఆగక సభ్యసమాజం తలదించుకునేలా అత్యంత అసభ్య పదజాలంతో దూషిస్తూ రుద్రరూపం దాల్చారు. చేతిలో ఉన్న వాటర్‌ బాటిల్‌ను విసిరికొట్టి, సమీపంలోని కుర్చీని కాలితో తన్నుతూ, టేబుల్‌ను ఏపీఓ పైకి నెట్టేందుకు ప్రయత్నించడంతో ఏపీఓతో పాటు అక్కడి ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. ఉన్నతాధికారి చేసిన ఈ వీరంగాన్ని చూసి షాక్‌కు గురైన అక్కడి పంచాయతీ, సచివాలయ సిబ్బంది.. పీడీ ప్రవర్తనకు నిరసనగా, ఏపీఓకు మద్దతుగా లేఖ రూపంలో అధికారులకు అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement