పాఠశాల బస్సుల ముమ్మర తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పాఠశాల బస్సుల ముమ్మర తనిఖీ

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

పాఠశాల బస్సుల ముమ్మర తనిఖీ

పార్వతీపురం రూరల్‌:

విద్యార్థుల ప్రయాణ భద్రత దృష్ట్యా ఎస్పీ ఎస్వీ మాధవ్‌ రెడ్డి ఆదేశాలతో పార్వతీపురం పట్టణంలో శుక్రవారం పోలీస్‌, రవాణా శాఖాధికారులు సంయుక్తంగా స్కూల్‌ బస్సులపై తనిఖీలు చేపట్టారు. ఏఎస్పీ మనీషా రెడ్డి ఉత్తర్వుల మేరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో బస్సుల ఫిట్‌నెస్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెనన్స్‌ పత్రాలతో పాటు ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, అగ్నిమాపక పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. డ్రైవర్లు డ్రైవింగ్‌ చేస్తూ మొబైల్‌ మాట్లాడరాదని, మద్యం తాగి వాహనం నడిపితే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ప్రతిరోజూ వాహనం కండిషనన్‌ సరిచూసుకుని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ తనిఖీల్లో పట్టణ ఎస్సై గోవింద్‌, ఎంవీఐలు కె.సుమన్‌, కాశి రామ్‌, ట్రాఫిక్‌ ఎస్సై పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement