రెండు బైక్‌లు ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు

May 8 2026 1:01 PM | Updated on May 8 2026 1:01 PM

రెండు బైక్‌లు ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు కోలుకుంటున్న క్షతగాత్రులు

గజపతినగరం: స్థానిక పైడితల్లమ్మ వారి గుడి సమీపంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. గజపతినగరం మండలం మధుపాడ గ్రామానికి చెందిన బూడి చందు గురువారం ఉదయం గ్రామంలో తన తాతయ్యను బైక్‌ ఎక్కించుకుని లింగాలవలస గ్రామంలో దించి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో బొండపల్లి మండలం బొండపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు బి.సింహాద్రి, ఈశ్వరమ్మలు ఓ తోటలో సపోటా పళ్లు ఏరేందుకు గజపతినగరం నుంచి బైపాస్‌ రోడ్డు గుండా బైక్‌పై వెళ్తున్నారు. ఆ సమయంలో గుడి సమీపంలో ఆ రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో మధుపాడ గ్రామానికి చెందిన బూడి చందు కుడిచేయి ఫ్రాక్చర్‌ అయింది. బి.సింహాద్రికి ఎడమ చేయి ఫ్రాక్చర్‌ కావడంతో పాటు తలకు కుట్లు పడ్డాయి. అలాగే సింహాద్రి భార్య ఈశ్వరమ్మకు స్పల్ప గాయమైంది. వారిని బంధువులు గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. మెరుగైన వైద్యం కోసం చందును గజపతినగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, సింహాద్రిని విజయనగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.పోలీసులు క్షతగాత్రుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడికి తీవ్రగాయాలు

బొబ్బిలి: పట్టణంలోని ఫ్‌లైఓవర్‌ డౌన్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని పక్కి గ్రామానికి చెందిన శంబంగి శంకర రావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఐ కె.నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం తాహసీల్దార్‌ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శంకర్‌ విధులు ముగించుకుని రాత్రి 10 గంటల సమయంలో బైక్‌పై తిరిగి వస్తుండగా ఫ్‌లైఓవర్‌ వద్ద ఎదురుగా వస్తున్న లారీని ప్రమాదవశాత్తు ఢీకొన్నాడు. ఈ సంఽఘటనలో శంకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడ్ని స్థానిక ిసీహెచ్‌సీలో చేర్పించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బంధువులు విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు.ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, కోమాలో ఉన్నట్లు బంధువులు తెలిపారు.

సీతంపేట: మండలంలోని పుట్టిగాంలో వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా సవరపాడు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బెన్నరాయి వాసులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 18 మంది గాయపడగా వారిలో మెరుగైన వైద్యం కోసం పదిమందిని శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. మిగతా 8 మందికి ఆర్‌ఎంవో డీవీ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో వైద్యసేవలు అందుతున్నాయి.

మరో మహిళకు స్వల్ప గాయం

Advertisement
 
Advertisement
Advertisement