గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026

May 7 2026 9:14 AM | Updated on May 7 2026 9:14 AM

న్యూస్‌రీల్‌

● కొద్ది రోజుల కిందట.. ఆ గ్రామంలో అంగన్‌డీ కార్యకర్త పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన కార్యకర్త.. తన భార్యకు ఆ పోస్టు ఇప్పించాలని, తన నియోజకవర్గ ప్రజా ప్రతినిధిని కలిశాడు. సదరు నేత.. అసలు మొహమాట పడకుండా ఆ పోస్టుకు బేరం పెట్టారు. రూ.3 లక్షలకు రేటు కుదిరింది. అడిగిన మొత్తం ఆ కార్యకర్త ఇచ్చుకున్నాడు. తీరా పోస్టు వారికి రాలేదు. ఆ పక్క ఇంట్లోనే ఉంటున్న మరో మహిళకు వచ్చింది. వాస్తవానికి ఆమె కంటే అన్ని అర్హతలూ తన భార్యకే ఉన్నాయని భావించిన ఆ వ్యక్తి.. ఆరా తీస్తే, ఉద్యోగం పొందిన వారు.. అదే ప్రజాప్రతినిధికి రూ.5 లక్షలు ఇచ్చారని తెలుసుకున్నాడు. ఆగ్రహంతో సదరు నేతను నిలదీశాడు. స్పందన లేదు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగాడు.. ఫలితం లేదు. దీంతో ఎన్నో రోజులు కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ చుట్టూ తిరిగాడు.

● బలిజిపేట మండలం పనుకువలస గ్రామానికి చెందిన మర్రాపు సూర్యనారాయణ 1987 నుంచి టీడీపీలో ఉంటున్నారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, కో ఆపరేటివ్‌ వంటి పదవులు చేశారు. పార్టీకి వీరాభిమాని. కొద్ది రోజుల కిందట తన కుమారుడు కరిష్మానాయుడుకు ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టు కోసం ప్రయత్నం చేశారు. ఇక్కడా.. తమ్ముడు తమ్ముడే! పేకాట పేకాటే!! రూ.4 లక్షలకు బేరం తెగింది. ఆ యువకుడు పోస్టులో కూడా చేరిపోయాడు. ఆరు నెలలు అయ్యింది. చేసిన పనికి జీతం రావడం లేదు. సరికదా.. ఎలాగైనా అతని మీద అభియోగాలు మోపి, ఉద్యోగంలో నుంచి తీసేయాలని అధికారుల మీద పార్టీ నియోజకవర్గ నేత నుంచి ఒత్తిడి పెరిగింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇదే పోస్టుకు రూ.8 లక్షల ఆఫర్‌ వచ్చిందట. దీంతో జాబ్‌ కార్డు కారణం చూపిస్తూ.. కరిష్మా నాయుడును తొలగించారు. ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకుని ఉన్న ‘తమ్ముడికి’ ఇదా బహుమానం అంటూ మర్రాపు సూర్యనారాయణ సదరు నేతను నిలదీశాడు. దీంతో రూ.3 లక్షలు తిరిగి ఇచ్చారు. ఇంకా రూ.లక్ష ఇవ్వకపోవడంతో బాధితుడు పీజీఆర్‌ఎస్‌ను ఆశ్రయించాడు.

Advertisement
 
Advertisement
Advertisement