మెరుగైన వైద్య సేవలు అందించండి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలు అందించండి

May 7 2026 9:14 AM | Updated on May 7 2026 9:14 AM

మెరుగైన వైద్య సేవలు అందించండి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి వైద్యులకు సూచించారు. సీతంపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె బుధవారం రాత్రి పరామర్శించారు. అప్పటికే ఆస్పత్రిలో దగ్గరుండి వైద్యసేవలు పర్యవేక్షిస్తున్న పాలకొండ సబ్‌కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవర్‌స్వప్నిల్‌తో మాట్లాడారు. వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని కోరారు. అనంతరం అక్కడ చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరిని పేరుపేరునా పరామర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్‌ కన్వీనర్‌ నిమ్మక కాంతారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement