సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం ఐటీడీఏ ద్వారా అందజేస్తున్న రాయితీ ట్రాక్టర్లపై లబ్ధిదారు లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉపయో గం లేని వాహనాలను తీసుకుని ఏం చేసుకుంటా మని ప్రశ్నిస్తున్నారు. 2023లో పలువురు ఎస్టీ రైతు లు ట్రాక్టర్ల కోసం పార్వతీపురం ఐటీడీఏకు దరఖా స్తు చేసుకున్నారు. ఇటీవల సుమారు 20 మందికి వాహనాలు మంజూరు అయినట్లు సమాచారం అందింది. సుమారు రూ.6.50 లక్షలు ఫైనాన్స్ చేసుకోవాలని.. రూ.1.50 లక్షలు రాయితీ లభిస్తుందని ఐటీడీఏ అధికారులు చెప్పారు. ఇక్కడే ఒక కొర్రీ పెట్టారని రైతులు అంటున్నారు. తాము ప్రముఖ సంస్థకు చెందిన ట్రాక్టర్లు అడిగామని.. ఇప్పుడు మరో సంస్థ వాహనాలు ఇస్తామంటున్నారని చెబుతున్నారు. ఆ సంస్థకు సంబంధించిన పరికరాలు, సర్వీసు సెంటర్ ఏదీ ఇక్కడ లేదని.. ఇదే విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పైగా ఆ వాహనాల మన్నిక కూడా తక్కువని.. వాటివల్ల తమకు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కు వ ఉంటుందని చెబుతున్నారు. రాయితీ మొత్తం కూడా తక్కువ ఇస్తున్నారని.. దీనిపై అధికారులు పునఃపరిశీలన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


