డెంకాడ: వీఎంఆర్‌డీఏ రోడ్డు అలైన్‌మెంట్‌ను డెంకాడ మండలం గుణుపూరుపేట గ్రామ పరిధిలోని నివాస గృహాలకు ఇబ్బంది లేకుండా ఇవ్వాలంటూ విశాఖలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయం వద్ద గ్రామస్తులు సోమవారం ఆందోళన చేశారు. గ్రామంలోని యాతపేట, బీసీ కాలనీ మీదుగా మొదటి అలైన్‌మెంట్ రోడ్డు వెళ్తే పేద కుటుంబాలు నిరాశ్రయులుగా మారుతారన్నారు. కొందరు రియల్ వ్యాపారులు తమ భూములను కాపాడుకునేందుకు పేదల ఇళ్లపై నుంచి రోడ్డు నిర్మించేందుకు పట్టుబడుతు న్నారని ఆరోపించారు. పేదల నివాసాలను కూల్చేసే అలైన్‌మెంట్ వద్దంటూ గ్రామ ప్రజలు, రైతులు వీఎంఆర్‌డీఏ చైర్మన్ వి.ప్రణవ్‌గోపాల్, అధికారులకు గోడు వినిపించారు.


