అక్కడ చేసేశారు.. ఇక్కడ చూస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

అక్కడ చేసేశారు.. ఇక్కడ చూస్తున్నారు!

Apr 7 2026 7:31 AM | Updated on Apr 7 2026 7:31 AM

అక్కడ చేసేశారు.. ఇక్కడ చూస్తున్నారు! ‘పది’ మూల్యాంకనం ప్రారంభం వందరోజుల జలధారకు కార్యాచరణ వేతన చెల్లింపుల్లో గందరగోళం

సాక్షి, పార్వతీపురం మన్యం: టీడీఏ పరిధిలోని భాషా పండితులు (తెలుగు, హిందీ), పీఈటీలను పాఠశాల సహాయకులుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం కొద్ది రోజుల కిందట జీఓ 27 జారీ చేసింది. సీఆర్‌టీలుగా ఉద్యోగంలో చేరి, రెగ్యులర్‌ అయిన వారికి నెల రోజుల కిందటే అప్‌గ్రేడ్‌ చేస్తూ, ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల్లో ఈ నెల ఒకటినే ఉత్తర్వులు అందజేశారు. పార్వతీపురం ఐటీడీఏలో ధ్రువపత్రాల పరిశీలన ఇది వరకే పూర్తయ్యింది. ఒకటో తేదీ దాటిపోయినా.. భాషా పండితులకు, పీఈటీల కు పాఠశాల సహాయకులుగా నేటికీ అప్‌గ్రేడ్‌ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఫలితంగా ఐటీడీఏ పరిధిలో 34 మందికి ఎదురుచూపులు, నిరుత్సాహం తప్పడం లేదు. దీంతో వారు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోమవా రం కూడా కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు వచ్చి వినతిపత్రం అందజేశారు.

పార్వతీపురం రూరల్‌: జిల్లా కేంద్రంలోని డీవీఎంఎం హైస్కూల్‌, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి సమాధానపత్రాల మూల్యాంకన ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం ఐదు సబ్జెక్టులకు సంబంధించి జిల్లాకు 98,377 జవాబు పత్రా లు రాగా.. తొలిరోజు 4,982 జవాబు పత్రాల ను మూల్యాంకనం చేసినట్టు డీఈఓ పి.బ్రహ్మాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విధుల్లో చీఫ్‌ ఎగ్జామినర్లు, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్పెషల్‌ అసిస్టెంట్లు కలిపి మొత్తం 418 మంది సిబ్బంది పాల్గొంటారని చెప్పారు.

పార్వతీపురం: జిల్లాలో జలధార కార్యక్రమాన్ని వందరోజుల లక్ష్యంతో వేగంగా అమలు చేయాలని కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నీటి భద్రత, సాగునీటి సంఘ బాధ్యత, వందరోజుల ప్రణాళిక పోస్టర్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో నీటి నిల్వ సామర్‌ాధ్యన్ని పెంచడం, వృథాను అరికట్టడం ప్రధాన లక్ష్యమన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ, పూడిక తొలగింపు, కాల్వల మర మ్మతులు చేపట్టాలని సూచించారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకునేందుకు ఆధునిక పద్ధతులు అవలంబించాలని కోరా రు. జిల్లాలో సుమారు 2,900 చెరువులను గుర్తించి ఫెన్సింగ్‌, మొక్కలు నాటే పనులు చేప డతామని చెప్పారు. ఎమ్మెల్యేలు టి.జగదీశ్వరి, బి.విజయచంద్ర, జేసీ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, నీటి సంఘాల నాయకులు, పాల్గొన్నారు.

విజయనగరం రూరల్‌: జిల్లాలో గ్రేడ్‌–3 పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీఓ) వేతనాల చెల్లింపులో గందరగోళం నెలకొంది. జీఓ నెం.91 ప్రకారం అమలు కావాల్సిన జీతాలను పక్కనబెట్టి, జీఓ 60 ప్రకారం తక్కువగా చెల్లింపులు చేస్తున్నారని సంఘ ప్రతినిధులు తెలిపా రు. గ్రేడ్‌–3 పీడీఓలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement