ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శన

Apr 7 2026 7:31 AM | Updated on Apr 7 2026 7:31 AM

ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శన

పార్వతీపురం రూరల్‌: ఉపాధ్యాయుల న్యాయమైన 18 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉపా ధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేర కు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లాలో నిరసనలు తెలిపారు. పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాలకు (స్పాట్‌ వాల్యుయేషన్‌) ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో హాజరై నిరసన తెలిపారు. 12వ పీఆర్సీని నియమించాలని, 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలని, సీపీఎస్‌ రద్దుచేసి పా త పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల మంజూ రు, రిటైర్మెంట్‌ ప్రయోజనాల తక్షణ చెల్లింపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. స్పాట్‌ కేంద్రాలను సందర్శించిన ఫ్యాప్టో జిల్లా ప్రతినిధి బాలకృష్ణ, అధ్యక్షుడు కూర్మినాయుడు, కార్యద ర్శి భాస్కరరావు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కా రం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 9న స్పాట్‌ కేంద్రాల వద్ద ధర్నా నిర్వహిస్తామ ని, ఏప్రిల్‌ 25 నుంచి 27వ తేదీ వరకు విజయవాడ లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని వెల్లడించా రు. జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement