పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Aug 3 2025 8:10 PM | Updated on Aug 3 2025 8:10 PM

పెట్ట

పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

సాలూరు: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌ కింద ప్రభుత్వం అందజేసిన పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ సూచించారు. సాలూరు పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో శనివారం పెట్టుబడి సాయం నిధుల విడుదలలో ఆయన పాల్గొన్నారు. మంత్రి సంధ్యారాణితో కలిసి రైతులకు అన్నదాత సుఖీభవ నమూనా చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్‌, డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున, ఏఎంసీ చైర్మన్‌ ముఖి సూర్యనారాయణ, డీఏఈ రాబర్ట్‌పాల్‌, తదితరులు పాల్గొన్నారు.

దురిబిలి సమీపంలో ఏనుగులు

గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలంలోని దురిబిలి గ్రామ సమీపంలోని కొండ వద్ద ఏనుగులు శనివారం సంచరించాయి. ఖరీఫ్‌ సాగు, కొండపోడు పనులు జరుగుతున్న సమయంలో ఏనుగుల సంచారంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. ఏనుగులను తరలించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పంచదారలో బల్లి

గుర్ల: మండలంలోని చిన్ననాగళ్లవలస రేషన్‌ డిపోలో సరఫరా చేసిన పంచదారలో చనిపోయిన బల్లి ఉండడంతో లబ్ధిదారు పి.పైడితల్లి ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై రెవెన్యూ అధికారులకు శనివారం ఫిర్యాదుచేశారు.

ఎస్‌ఎఫ్‌ఐ దీక్షలు భగ్నం చేసిన పోలీసులు

బలవంతంగా దీక్ష శిబిరం ఎత్తివేత

ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను స్టేషన్‌కు తరలింపు

పార్వతీపురం రూరల్‌: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం గత రెండు రోజులుగా కలెక్టరేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు శనివారం రాత్రి భగ్నం చేశారు. విద్యార్థి సంఘ నాయకుల ఆరోగ్యం క్షీణించడం, రాత్రిపూట దీక్షలు చేసేందుకు అనుమతులు లేకపోవడంతో బలవంతంగా ఎత్తివేయించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి.అఖిల్‌, కోశాధికారి కె.డేవిడ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ. గంగారాం, సీహెచ్‌ సింహాచలం, తదితరులను అరెస్టుచేసి పార్వతీపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. జిల్లాలో పీజీ సెంటర్‌ ఏర్పాటు చేయాలని, గిరిజన ఆశ్రమ, వసతి గృహాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ప్రధాన డిమాండ్లతో విద్యార్థులు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. పోలీసుల తీరుపై జిల్లా విద్యార్థిలోకం భగ్గుమంటోంది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తూ గొంతునొక్కేయాలని చూస్తోందన్నారు.

పెట్టుబడి సాయాన్ని   సద్వినియోగం చేసుకోవాలి 1
1/2

పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

పెట్టుబడి సాయాన్ని   సద్వినియోగం చేసుకోవాలి 2
2/2

పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement