విశ్వకర్మకు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

విశ్వకర్మకు ఘన నివాళి

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

నరసరావుపేట రూరల్‌: సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన విశ్వకర్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి అదనపు ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ శిల్పకళ, నిర్మాణరంగం, ఇంజినీరింగ్‌తోపాటు వాస్తు శాస్త్రానికి ఆధ్యుడిగా, నిర్మాణాలలో శాసీ్త్రయత, సౌందర్యం, సమతుల్యతకు ప్రాధాన్యతనిచ్చిన మహానీయుడిగా గుర్తింపు పొందారని వివరించారు. కార్యక్రమంలో వెల్పేర్‌ ఆర్‌ఐ గోపినాథ్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement