రాష్ట్రస్థాయి సైన్స్‌ సదస్సుకు ఇద్దరు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి సైన్స్‌ సదస్సుకు ఇద్దరు ఎంపిక

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

నరసరావుపేట ఈస్ట్‌: జాతీయ సైన్స్‌ సదస్సు పోటీలలో భాగంగా రాష్ట్రస్థాయి పోటీలకు పల్నాడు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎంపికై నట్టు జిల్లా సైన్స్‌ అధికారి ఎస్‌.రాజశేఖర్‌ గురువారం తెలిపారు. ‘ఇండియా ఎనర్జీ బాస్కెట్‌–2047 అనుకూలతలు, సవాళ్లు’పై ఈ నెల 16వ తేదీన శంకర భారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సెమినార్‌ పోటీల్లో దొడ్లేరు జడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని పి.యుక్త లక్ష్మీప్రియ ప్రథమస్థానం, చల్లగుండ్ల జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని కె.నాగరేవతి ద్వితీయస్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్టు వివరించారు. ఇద్దరిని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు షేక్‌ సుభాని, ఏసుబాబు, ఎంఈఓ–2 నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు పార్వతి, గైడ్‌ టీచర్లు జ్ఞానేశ్వరరావు, అనీలా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement