అక్రమ కేసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

పట్టుదలతో బెయిలు మంజూరు

మాబు తల్లిదండ్రులు

షేక్‌ బడేసాహెబ్‌, ఖాశీంబి

పిడుగురాళ్ల రూరల్‌: అక్రమ కేసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని, న్యాయం కాస్త ఆలస్యమైనా కచ్చితంగా న్యాయం గెలుస్తుందని పల్నాడు జిల్లా సోషల్‌ మీడియా ఉపాధ్యక్షులు షేక్‌ మాబు తల్లిదండ్రులు షేక్‌ బడేసాహెబ్‌, ఖాశీంబిలు అన్నారు. అక్రమ కేసులు బనాయించి పీడీయాక్ట్‌ ఓపెన్‌ చేయించి మార్చి 12వ తేదీన రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లిన పల్నాడు జిల్లా సోషల్‌ మీడియా ఉపాధ్యక్షులు షేక్‌ షేక్‌ మాబుకు పీడియాక్ట్‌ కేసులో శుక్రవారం బెయిల్‌ మంజూరు అయింది. వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ...గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కృషితోనే ఈ రోజు బెయిల్‌ మంజూరు అయిందన్నారు. ఆయన ప్రతిక్షణం ఈ కేసుపై దృష్టి పెట్టి మా కుమారుడు సెంట్రల్‌ జైలు నుంచి బయటకు వచ్చేందుకు కృషి చేశారన్నారు. మా కుటుంబ సభ్యులందరు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి రుణపడి ఉన్నామని ఆయన తెలిపారు. అనేక అక్రమ కేసులు బనాయించి జైలు శిక్ష అనుభవించటమే కాకుండా చివరకు పీడియాక్ట్‌ కూడా కట్టి మార్చి 12వ తేదీన రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపించారని 44 రోజులు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవించాడని వారు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. న్యాయం గెలుస్తుందని, కుట్రలు ఓడిపోయి నీతి నిలబడిందని వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement