పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,000, గరిష్ట ధర రూ.11,500, మోడల్‌ ధర రూ.8,000 వరకు పలికింది. సాగర్‌ నీటిమట్టం బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు.
నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,000, గరిష్ట ధర రూ.11,500, మోడల్‌ ధర రూ.8,000 వరకు పలికింది.

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 527.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 4,156 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

హామీలివ్వడం... వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ప్రసంగాలలో ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టడం బాబు నైజం. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో సైతం క్రోసూరు, అమరావతి మండల కేంద్రాలలో రెండేళ్ల క్రితం జరిగిన సభల్లో పెదకూరపాడు నియోజకవర్గానికి చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. బాబు సర్కార్‌ ఏర్పడి రెండేళ్లు అవుతున్నా వాటిని అమలు చేయకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు చీదరించుకుంటున్నారు. అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి మండల కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రాంతానికి చేసిన వాగ్దానాలను ప్రజలు గుర్తు చేస్తున్నారు.

7

Advertisement
 
Advertisement
Advertisement