కూటమి మెడి‘కిల్‌’ | - | Sakshi
Sakshi News home page

కూటమి మెడి‘కిల్‌’

Jun 18 2025 3:23 AM | Updated on Jun 18 2025 3:23 AM

కూటమి

కూటమి మెడి‘కిల్‌’

పిడుగురాళ్ల: పల్నాడు ప్రాంతానికి మణిహారం లాంటి ప్రభుత్వ వైద్యశాల, వైద్య కళాశాల నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రూ.540 కోట్ల వ్యయంతో శరవేగంగా సాగిన మెడికల్‌ కాలేజీ పనులు 80శాతం వరకు పూర్తయ్యా యి. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం భవన నిర్మాణాలను అటకెక్కించింది. దీనిపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై సెల్ఫీ వీడియోలు తీస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

80 శాతం వరకు పూర్తిచేసిన గత ప్రభుత్వం

వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో పేద ప్రజలకు ఉచిత, కార్పొరేట్‌ తరహా వైద్యం అందాలనే లక్ష్యంతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిడుగురాళ్ల పట్టణ సమీపంలోని కామేపల్లి వద్ద 2019లో 50 ఎకరాల్లో మెడికల్‌ కళాశాల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. సుమారు 80 శాతం వరకు ప్రభుత్వ వైద్యశాల, కళాశాలతో పాటు నర్సింగ్‌ కాలేజీ భవనాలు, హాస్టల్‌ భవనాలు నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. వైద్యశాల మొదటి బ్లాకు నిర్మాణం పూర్తయింది. మిగిలిన ఐదు బ్లాకులు కూడా నిర్మాణ పనులలో ఉన్నాయి. ఈ ఐదు బ్లాకులు పూర్తయితే వెంటనే వైద్యసేవలు ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్‌ కళాశాల, వైద్యశాల నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో ఆగిపోయాయి. దీంతో ఈ ప్రాంతవాసులు మెరుగైన వైద్యసేవలకు గుంటూరు, విజయవాడ లాంటి దూరప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

సెల్ఫీ వీడియోల హల్‌చల్‌

కూటమి ప్రభుత్వ నిర్వాకాలను ఎండగట్టేందుకు ఇటీవల వైఎస్సార్‌ సీపీ గురజాల సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మెడికల్‌ కళాశాల వద్దకు వచ్చి, కూటమి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిర్మాణం మొదలుపెట్టకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో వైఎస్సార్‌ సీపీ నేతలతో పాటు ఈ ప్రాంత యువత కూడా మెడికల్‌ కళాశాల వద్దకు వచ్చి సెల్ఫీ వీడియోలతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. తమ ప్రాంతంలో పేద ప్రజలకు ఆణిముత్యం లాంటి మెడికల్‌ కళాశాలను వెంటనే ప్రభుత్వం పునఃప్రారంభించాలని పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని నినదిస్తున్నారు.

నత్తనడకన పిడుగురాళ్ల మెడికల్‌

కాలేజీ నిర్మాణ పనులు

గత నాలుగు నెలలుగా పూర్తిగా

నిలిచిన పనులు

పనులు చేపట్టాలంటూ సెల్ఫీ వీడియోల

ద్వారా స్థానికుల డిమాండ్‌

కూటమి మెడి‘కిల్‌’1
1/2

కూటమి మెడి‘కిల్‌’

కూటమి మెడి‘కిల్‌’2
2/2

కూటమి మెడి‘కిల్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement