మల్లెపూలు అమ్మి ఇంటికి వెళ్తుండగా కన్నేసిన ఆటోడ్రైవర్‌.. | - | Sakshi
Sakshi News home page

మల్లెపూలు అమ్మి ఇంటికి వెళ్తుండగా కన్నేసిన ఆటోడ్రైవర్‌..

Aug 9 2023 7:22 AM | Updated on Aug 9 2023 1:28 PM

- - Sakshi

బాధితురాలు ఒకటే ఉండటంతో ఆటో డ్రైవర్‌ తన ఆటోను దేవరపల్లి గ్రామ పొలాల్లోకి వెళ్లి డొంక దారిలోకి తీసుకెళ్లి

పర్చూరు (చినగంజాం): బాపట్ల జిల్లా పర్చూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు పిల్లి నాగేంద్ర బాబు అలియాస్‌ మోసెస్‌కు మంగళవారం ఒంగోలు అడిషనల్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్‌ 13 సంవత్సరాల జైలు, రూ.4 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కేసు వివరాలను పరిశీలిస్తే బాధితురాలు బాపట్ల జిల్లా చీరాల నుంచి పర్చూరు మండలం అడుసుమల్లి గ్రామానికి అరటికాయలు, మల్లెపూలు తీసుకొని వచ్చి అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి వెళ్తుండేది.

ఈ క్రమంలో 2021 జూలై 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు అడుసుమల్లి నుంచి పర్చూరుకు రావడానికి గుంటూరు వైపు నుంచి వస్తున్న ఆటోలో ఎక్కింది. అందులో బాధితురాలు ఒకటే ఉండటంతో ఆటో డ్రైవర్‌ తన ఆటోను దేవరపల్లి గ్రామ పొలాల్లోకి వెళ్లి డొంక దారిలోకి తీసుకెళ్లి బాధితురాలిని చంపుతానని బెదిరించి ఆమైపె లైంగికదాడి చేశాడు. బాధితురాలు అతని బారి నుంచి తప్పించుకొని పర్చూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

కేసు దర్యాప్తు ప్రారంభించిన అప్పటి ఇంకొల్లు సీఐ పీ సుబ్బారావు నిందితుడైన ఆటో డ్రైవర్‌ పిల్లి నాగేంద్ర బాబు అలియాస్‌ మోసెస్‌ నేరం చేసినట్లు నిర్ధారించి అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. నేరం రుజువు కావడంతో రుజువు చేయడంతో న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్‌ నేరస్తుడికి 13 ఏళ్ల జైలుశిక్ష రూ.4 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ పోలీస్‌ అధికారులను, పీపీని అభినందించారు. డీజీపీ కే రాజంద్రనాథ్‌రెడ్డి మహిళల సంబంధిత నేరాల్లోని నిందితులకు జైలు శిక్ష పడేలా సంబంధిత కేసుల్లో పోలీస్‌ అధికారులు ఎప్పటికప్పుడు ట్రయల్‌ మానిటరింగ్‌ నిర్వహిస్తున్నారన్నారు. ఈ కోర్టు ట్రయల్‌ మానిటరింగ్‌ సత్ఫలితాలను ఇస్తుందన్నారు. పోలీసు అధికారులే స్వయంగా కోర్టు ట్రయల్‌ను పర్యవేక్షించడం వలన గతంలో పోలిస్తే ప్రస్తుతం కోర్టులో విధించే శిక్షల శాతం పెరిగిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement