ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్య ధోరణి
● కోటీశ్వరులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకుల కంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సంపన్న వర్గాల వారా అని ప్రశ్నించారు. ఈ వివక్షతను ప్రశ్నించాల్సిన తక్షణ అవసరం ఉపాధ్యాయులందరిపై ఉందన్నారు. నెలవారీ క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా ఆరోగ్య నిధుల చెల్లింపులు రూ. 25 లక్షల వరకు పరిమితి పెంచాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో భాగంగా గురువారం నుంచి ప్రారంభమైన ‘నిరసన వారం’ ఈ నెల 12న అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, 13,14న ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు, 15న పాత తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, 17న సీఎం, సీఎస్‌లకు వాట్సాప్, ఈ–మెయిల్ ద్వారా వినతులు పంపించడం జరుగుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, మెమో నెంబర్ 57ను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 12వ ిపీఆర్‌సీ కమిషన్‌ను నియమించి, ఐఆర్ ప్రకటించాలని, అన్నిరకాల బకాయిలను చెల్లించాలని, ఈహెచ్‌ఎస్ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచాలని, యాప్‌లను, అసెస్మెంట్ బుక్‌లెట్ విధానాలను రద్దుచేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
సత్తెనపల్లి: ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ బాధ్యులు అన్నారు. పట్టణంలోని సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సత్తెనపల్లి మండలం కట్టమూరు, రాజుపాలెం మండలం గణపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం ‘నిరసన వారం’లో భాగంగా ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఈనెల 4న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆరోగ్యమస్తు పథకంలో ఉద్యోగులను మినహాయించి, రాష్ట్రంలో అందరికీ రూ.25 లక్షల వరకు ఆరోగ్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. పేదల నుంచి కోటీశ్వరుల వరకు ఆరోగ్యానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని, ఈహెచ్‌ఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రం మినహాయింపు ఎందుకన్నారు.
ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో
‘నిరసన వారం’ చేపట్టిన ఉపాధ్యాయులు