గుంటూరు జిల్లా కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా | - | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా

Sep 12 2025 6:17 AM | Updated on Sep 12 2025 6:17 AM

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా  తమీమ్‌ అన్సారియా

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా

గుంటూరు వెస్ట్‌: గుంటూరు జిల్లా కలెక్టర్‌గా 2015 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన తమీమ్‌ అన్సారియాను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన ఆమె ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. జిల్లా కలెక్టర్‌గా ఇప్పటి వరకు పనిచేసిన ఎస్‌.నాగలక్ష్మిని జీఏడీలో రిపోర్ట్‌ చేయమని ఆదేశించారు. ఇటీవలే జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్‌, జేసీల కాంబినేషన్‌లో పాలన కొనసాగనుంది. 38 ఏళ్లలో జిల్లాకు మూడో మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్‌ వచ్చారు. 1987లో జన్నత్‌ హుస్సేన్‌ పనిచేయగా 2007 లో మొహమ్మద్‌ ఆలీ రఫత్‌ను జిల్లా కలెక్టర్‌గా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నియమించారు. మళ్లీ జిల్లాకు మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్‌ రావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement