
యూరియా.. కష్టం తీరలేదయా!
అధిక వర్షాలకు పంటలను కాపాడుకునేందుకు యూరియా వాడాల్సి వస్తోంది. రైతుకు ఒక బస్తా తీసుకెళ్లమని సర్కార్ చెబుతోంది. కానీ అలా ఇస్తే రైతులకు యూరియా సరిపోదు. సరఫరా మరింత పెంచాల్సి ఉంది.
– మర్రి శ్రీనివాసరెడ్డి,
ఆదర్శ రైతు, దొడ్లేరు
దొడ్లేరు(క్రోసూరు): మండలంలోని దొడ్లేరు గ్రామంలో గురువారం రైతు సేవా కేంద్రంలో యూరియా బస్తాల కోసం అన్నదాతలు బారులు తీరారు. ఒక్కో రైతుకు పాస్ పుస్తకం ప్రకారం బస్తా అందించేందుకు అధికారులు నిర్ణయించారు. ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాసి ఒకే బస్తా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది క్యూలైనులో నిలిచి ఉండే ఓపిక లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి రిక్తహస్తాలతోనే నిరాశగా వెనుదిరిగారు. ఏవో వేణుగోపాల్ మట్లాడుతూ కొద్దిరోజుల్లో జీడీసీసీ, సొసైటీల్లో కూడా యూరియా అందుబాటులోకి వస్తుందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు.